సౌత్ క్యారెక్టర్లే గొప్ప.. నార్త్ లో అన్నీ మర్చిపోయేవే: పూజ
ఆ తర్వాత టాలీవుడ్ లో మార్కెట్ డౌన్ అయింది. ఇప్పుడు మళ్లీ అవకాశాలు వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
By: M Prashanth | 13 Aug 2025 10:00 PM ISTపొడుగు కాళ్ళ సుందరి పూజా హెగ్డే పాన్ ఇండియా హీరోయిన్ అని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో నటిస్తోంది అమ్మడు. ఇప్పుడు వివిధ బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్నా.. టాలీవుడ్ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. స్టార్ హీరోల సరసన నటించిన ఆమెకు సూపర్ హిట్స్ సొంతమయ్యాయి.
ఆ తర్వాత టాలీవుడ్ లో మార్కెట్ డౌన్ అయింది. ఇప్పుడు మళ్లీ అవకాశాలు వస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో బాలీవుడ్, కోలీవుడ్ లో యాక్ట్ చేస్తోంది పూజా హెగ్డే. తమిళంలో కొంచెం బిజీగా ఉన్న బ్యూటీ.. హిందీలో మాత్రం యమా బిజీగా ఉందని చెప్పాలి. ఇప్పుడు కూలీలో మోనిక సాంగ్ తో సందడి చేయనుంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాలీవుడ్ తనకు సరైన పాత్రలు ఇవ్వలేదని వ్యాఖ్యానించిన పూజ.. అక్కడి వాళ్లు తనను ఎప్పుడూ గ్లామర్ హీరోయిన్ లాగే చూశారని తెలిపింది అమ్మడు. చెప్పాలంటే.. పెద్దగా గుర్తింపు లేని పాత్రలు ఇచ్చారని పూజా చెప్పడం గమనార్హం.
తాను చేసిన ఆ రోల్స్ అన్నీ మర్చిపోయేవే అని తెలిపింది. కానీ సౌత్ సినిమాల్లో మాత్రం తనకు మంచి మంచి క్యారెక్టర్లు దక్కాయని చెప్పిన పూజ.. రీసెంట్ గా ఆమె నటించిన రెట్రో మూవీ కోసం ప్రస్తావించింది. స్టార్ హీరో సూర్య లీడ్ రోల్ లో నటించిన ఆ సినిమాలో రుక్మిణీ రోల్ లో సందడి చేసి తన నటనతో మెప్పించింది పూజా హెగ్డే.
మూవీలో తన రోల్ ను డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు అద్భుతంగా డిజైన్ చేశారంటూ కొనియాడింది. తాను ఎలాంటి రోల్ అయినా ఎలా పెర్ఫామ్ చేయగలనో ఆ సినిమా చూపించిందని చెప్పిన ఆమె.. ఇలాంటి పాత్రలు మరిన్ని చేయాలని ఉందని తన మనసులోని మాటను బయట పెట్టింది. మొత్తానికి సౌత్ లో గొప్ప గొప్ప క్యారెక్టర్లు చేశానని చెప్పుకొచ్చింది.
అయితే సౌత్‌లో కొన్ని సినిమాలు చేసి మంచి క్రేజ్ సంపాదించుకుని.. బాలీవుడ్‌కు వెళ్లాక అనేక మంది హీరోయిన్స్ ఇక్కడి సినిమాలను తక్కువ చేసి మాట్లాడుతుంటారు. ఇక్కడ క్రేజ్ తగ్గి అక్కడ గ్లామరస్ రోల్స్ చేస్తుంటారు. కానీ సౌత్ సినిమాలపై బురదజల్లుతంటారు. కానీ పూజ మాత్రం భిన్నమైన వైఖరిని తీసుకున్నారు. తన వ్యాఖ్యలతో అందరినీ ఆశ్చర్యపరిచారు.