మోనికాని బాలీవుడ్ అలా చూస్తోందా?
ముంబై బ్యూటీ అయినా బాలీవుడ్ లో మాత్రం అవకాశాలు రాలేదు. తాజాగా ఈ అంశంపై పూజాహెగ్డే తొలిసారి స్పందించింది.
By: Srikanth Kontham | 13 Aug 2025 7:00 PM ISTపూజాహెగ్డే కెరీర్ ఎలా ప్రారంభమైందో తెలిసిందే. కోలీవుడ్ లో మొదలైన ప్రస్తానం అటుపై టాలీవుడ్ అక్కడ నుంచి బాలీవుడ్ కి వెళ్లింది. పుట్టి పెరిగింది ముంబై కావడంతో బాలీవుడ్ లోనే స్థిరపడాలని ప్లాన్ చేసుకుంది. కానీ కెరీర్ అక్కడ మాత్రం ఆశించిన విధంగా సాగలేదు. సౌత్ లో వచ్చినట్లు అవకాశాలు హిందీ పరిశ్రమ లో రాలేదు. పదేళ్ల ప్రస్తానం తెలుగు, తమిళ సినిమాలే ఎక్కువగా చేసింది. హిందీలో నాలుగైదు సినిమాలకే పరిమితమైంది. ఆ నాలుగు కూడా పెద్దగా సక్సస్ అవ్వలేదు. అలా పూజాహెగ్డే బాలీవుడ్ కి సపరేట్ గా మారింది.
ప్రతిభను గుర్తించక:
ముంబై బ్యూటీ అయినా బాలీవుడ్ లో మాత్రం అవకాశాలు రాలేదు. తాజాగా ఈ అంశంపై పూజాహెగ్డే తొలిసారి స్పందించింది. ఇప్పటి వరకూ బాలీవుడ్ అంటే పాజిటివ్ గానే స్పందించిన అమ్మడు కాస్త స్వరం మార్చినట్లే కనిపిస్తోంది. హిందీ దర్శక, రచయితలు తనని కేవలం గ్లామర్ డాల్ గానే చూస్తు న్నారంది. నటిగా తన లో ట్యాలెంట్ ను గుర్తించలేకపోతున్నారంది. తన ట్యాలెంట్ గురించి తెలియా లంటే సౌత్ లో తాను నటించిన సినిమాలు చూడాలని సూచించింది.
బాలీవుడ్ పై తిరుగు బావుటా:
తాను కేవలం ఐటం పాటలకు...ప్రత్యేక పాత్రలకు పరిమితమయ్యే నటని కాదని పేర్కొంది. అలాగే హిందీలో ఇంత వరకూ సరైన సినిమాలు గానీ, పాత్రలు గానీ పడలేదని అసహనం వ్యక్తం చేసింది. తనని సౌత్ వాళ్లు నమ్మినట్లు నార్త్ వాళ్లు నమ్మడం లేదా? అన్న సందేహాన్ని వ్యక్తం చేసింది. బాలీవుడ్ పై అమ్మ డు ఇంత వరకూ ఇలాంటి వ్యాఖ్యలు ఎన్నడూ చేయలేదు. హిందీ పరిశ్రమ అంటే పాజిటివ్ గానే స్పందించేది. కానీ అవకాశాలు రాకపోయే సరికి పూజాహెగ్డే తిరుగు బావుటా ఎగరేసినట్లే కనిపిస్తోంది.
మోనికా మెరుపులు:
టాలీవుడ్ అవకాశాలు పీక్స్ లో ఉన్న సమయంలో వద్దనుకుని మరీ బాలీవుడ్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. అటుపై కంబ్యాక్ అవ్వాలని శత విధాల ప్రయత్నాలు చేస్తున్నా? ఇప్పుడు తెలుగు లో అవకాశాలు రావడం లేదు. లక్కీగా కోలీవుడ్ పరిశ్రమ అవకాశాలు కల్పించడంతో ఆ మాత్రమైనా బిజీ అయింది. లేదంటే? డరీ మొత్తం ఖాళీ అయ్యేది. మరికొన్ని గంటల్లో మోనికాగా ( కూలీ రిలీజ్) ప్రేక్షకుల్ని అలరించడానికి రెడీగా ఉంది.