శిల్పా దంపతులు రూ.60 కోట్ల స్కామ్ కేసులో కొత్త మలుపు
ఆ నలుగురూ శిల్పా- రాజ్ కంపెనీలో ఉన్నత స్థానాల్లో పని చేసే వారేనని, వారిలో ఒకరు ఆల్రెడీ విచారణకు కూడా హాజరయ్యారని ఈఓడబ్ల్యూ వెల్లడించింది.
By: Sravani Lakshmi Srungarapu | 6 Nov 2025 8:00 PM ISTబాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బిజినెస్ మ్యాన్ దీపక్ కొఠారి చేసిన కంప్లైంట్ మేరకు రూ.60 కోట్ల మోసం కేసులో శిల్పా దంపతులపై జుహు పోలీసులు ఆల్రెడీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ కేసులో దర్యాప్తు వేగం పెరిగింది. తాజా సమాచారం ప్రకారం నిధుల మళ్లింపు లో కీలక పాత్ర పోషించిన నలుగురు ఉద్యోగులను దర్యాప్తు అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది.
నలుగురుని గుర్తించిన అధికారులు
ఆ నలుగురూ శిల్పా- రాజ్ కంపెనీలో ఉన్నత స్థానాల్లో పని చేసే వారేనని, వారిలో ఒకరు ఆల్రెడీ విచారణకు కూడా హాజరయ్యారని ఈఓడబ్ల్యూ వెల్లడించింది. అధికారులు ఈ నలుగురికీ సమన్లు జారీ చేసి ప్రశ్నించనున్నట్టు సమాచారం. దాంతో పాటూ కంపెనీ లావాదేవీల పేరుతో రాజ్ కుంద్రా డబ్బును వేరే దారికి మళ్లించారా లేదా అనే విషయంపై కూడా అధికారులు విచారణ చేస్తున్నారట.
రాజ్ కుంద్రాను 5 గంటల పాటూ విచారించిన అధికారులు
నిధుల్ మళ్లింపు ఎలా జరిగింది? ఏం చేశారనేది తెలుసుకోవడమే టార్గెట్ గా అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా, ఈ కేసు విషయంలో రాజ్ కుంద్రాను పోలీసులు ఇప్పటికే 5 గంటల పాటూ విచారించారు. ఓ వైపు కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పటికీ శిల్పా దంపతులు తరచూ ఫారిన్ ట్రిప్స్ కు వెళ్లడాన్ని గమనించిన అధికారులు వారికి ముందస్తు జాగ్రత్త చర్యగా లుకౌట్ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.
కాగా గతంలో కూడా రాజ్ కుంద్రా పేరుతో పేరుతో ఎన్నో బిజినెస్ డిస్‌ప్యూట్స్, యాప్ మోసాల కేసులు, క్రిప్టో కేసులు వెలుగు చూడగా, ఇప్పుడు రూ.60 కోట్ల కేసు కొత్త మలుపు తిరుగుతుండటంతో ఈ విషయం బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
