పెదరాయుడు బాలకృష్ణ... పాపారాయుడు ఎన్టీఆర్..!
టాలీవుడ్ చరిత్రలో నిలిచి పోయే చిత్రం పెదరాయుడు. ఈ సినిమా నాట్టమై అనే సినిమాకు రీమేక్. మోహన్ బాబు డ్యూయెల్ రోల్‌లో నటించిన ఈ సినిమాలో రజనీకాంత్ గెస్ట్ రోల్‌లో కనిపించి మెప్పించాడు.
By: Tupaki Desk | 30 April 2025 12:15 AM ISTసినిమా ఇండస్ట్రీలో ఒకే కథ ఎంతో మంది హీరోల వద్దకు, దర్శక నిర్మాతల వద్దకు తిరుగుతూ ఉంటుంది. ఒక హీరో చేయాలి అనుకున్న కథను మరో హీరో చేయడం, ఒక హీరో నో చెప్పిన కథను మరో హీరో చేయడం మనం చూస్తూనే ఉంటాం. పవన్ కళ్యాణ్ తిరస్కరించిన చాలా కథలను రవితేజ ఎంపిక చేసుకుని హిట్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి అంటారు. కొన్ని రీమేక్ సినిమాలు సైతం ఒక హీరో అనుకుంటే మరో హీరో చేతికి వెళ్తుంది. ఒరిజినల్ భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను రీమేక్ చేయాలని ఒక హీరో అనుకుంటే ఆ లోపే మరో హీరో ఆ రీమేక్ రైట్స్‌ను కొనుగోలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. దర్శక నిర్మాతలు కథలను పలు కారణాల వల్ల ఒక హీరో నుంచి మరో హీరో వద్దకు తీసుకు వెళ్తూ ఉంటారు.
టాలీవుడ్ చరిత్రలో నిలిచి పోయే చిత్రం పెదరాయుడు. ఈ సినిమా నాట్టమై అనే సినిమాకు రీమేక్. మోహన్ బాబు డ్యూయెల్ రోల్‌లో నటించిన ఈ సినిమాలో రజనీకాంత్ గెస్ట్ రోల్‌లో కనిపించి మెప్పించాడు. అప్పట్లో సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో మోహన్ బాబు స్టార్‌డం అమాంతం పెరగడం మాత్రమే కాకుండా ఆయనకు నిర్మాతగా బూస్ట్‌ను ఇచ్చింది. రజనీకాంత్ ఈ సినిమాలో కేవలం స్నేహం కోసం నటించాడు అని అంటారు. అంతే కాకుండా ఈ సినిమా రీమేక్ రైట్స్ మోహన్ బాబుకు దక్కడంలో రజనీకాంత్ కీలక పాత్ర పోషించాడని కూడా అంటూ ఉంటారు. మొదట ఈ సినిమా రీమేక్‌ను మరొకరు తీసుకునేందుకు ప్రయత్నించారు.
ప్రముఖ నిర్మాత కేవీవీ సత్యనారాయణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెదరాయుడు సినిమా వెనుక జరిగిన విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ నాట్టమై ను తెలుగులో రీమేక్ చేసేందుకు గాను రాఘవేంద్ర రావు సిద్ధం అయ్యారు. ఎన్టీఆర్, బాలకృష్ణలతో రీమేక్ చేయాలని ఆయన అనుకున్నారు. ఆ విషయమై చర్చలు జరిపేందుకు రెడీ అవుతున్న సమయంలోనే నాట్టమై రీమేక్ రైట్స్ను రజనీ కాంత్ కొనుగోలు చేసినట్లుగా రాఘవేంద్ర రావుకు తెలిసింది. దాంతో ఆయన తన రీమేక్ ఆలోచన విరమించుకున్నాడని ఆయన చెప్పుకొచ్చాడు. రజనీకాంత్ పోషించిన పాత్రను ఎన్టీఆర్, మోహన్ బాబు పోషించిన పాత్రలను బాలకృష్ణ పోషించి ఉండాల్సింది.
పెదరాయుడు సినిమాను మోహన్‌బాబు, రజనీకాంత్ కాకుండా ఎన్టీఆర్, బాలకృష్ణ చేసి ఉంటే మరో రేంజ్‌లో ఉండేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మోహన్ బాబుకి ఎన్టీఆర్ ఫ్యామిలీ తో సన్నిహిత్యం ఉంది. ఒకవేళ మోహన్ బాబును ఎన్టీఆర్ ఈ రీమేక్ గురించి తాము చేస్తామని అడిగి ఉంటే కచ్చితంగా ఆయన ఇచ్చేవారు. కానీ ఎన్టీఆర్ ఆ విషయమై మోహన్ బాబును సంప్రదించి ఉండడు. మోహన్ బాబు తాను ఎంతో ఇష్టపడ్డాడు కనుక స్వయంగా నిర్మించాడు. రీమేక్ రైట్స్ తీసుకుని ఉన్నా ఒకవేళ ఎన్టీఆర్ అడిగి ఉంటే కచ్చితంగా సినిమాను మోహన్ బాబు నిర్మించేవాడేమో. ఎన్టీఆర్, మోహన్ బాబు కాంబోలో సినిమా వచ్చినా కచ్చితంగా మరో లెవల్ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుని ఉండేది.