Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : చీర కట్టి, పూలు పెట్టిన పాయల్‌

ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా 45 లక్షల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఈ అమ్మడు ఎప్పుడూ తన అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా అభిమానులకు వినోదాన్ని పంచుతుంది.

By:  Tupaki Desk   |   8 July 2025 5:11 PM IST
పిక్‌టాక్ : చీర కట్టి, పూలు పెట్టిన పాయల్‌
X

తెలుగు ప్రేక్షకులకు ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో చేరువైన ముద్దుగుమ్మ పాయల్‌ రాజ్‌పూత్‌. మొదటి సినిమాలోనే నెగటివ్‌ షేడ్స్‌ లో కనిపించడంతో పాటు, బోల్డ్‌ పాత్ర చేయడం వల్ల చాలా మందికి అభిమాన నటిగా మారింది. తక్కువ సమయంలోనే ఎక్కువ సినిమాలు చేయడంతో ఖచ్చితంగా ఈమె భవిష్యత్తులో టాప్ హీరోయిన్‌ అవుతుందని అంతా భావించారు. కానీ పాయల్‌కి బోల్డ్‌ పాత్రలు, లేడీ ఓరియంటెడ్‌ పాత్రలు, ఐటెం సాంగ్స్‌కి మాత్రమే ఛాన్స్ దక్కాయి. వచ్చిన ప్రతి ఒక్క ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడం కోసం చాలా కష్టపడుతూనే ఉంది. ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా తన అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది.


ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా 45 లక్షల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న ఈ అమ్మడు ఎప్పుడూ తన అందమైన ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా అభిమానులకు వినోదాన్ని పంచుతుంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు, వీడియోలు ఎప్పటిలాగే ఆకట్టుకుంటున్నాయి. ఈసారి చీర కట్టి, పూలు పెట్టుకుని, బొట్టు పెట్టుకుని డిఫరెంట్‌గా కనిపించడంతో అంతా కూడా చూపు తిప్పలేకుండా అటే చూస్తూ ఉండి పోతున్నారు. సాధారణంగానే పాయల్‌ అందమైన ఫోటోలు చూస్తూనే ఉండాలి అనిపిస్తుంది. అలాంటిది ఇప్పుడు ఇలా సాంప్రదాయ స్త్రీగా చూస్తూ ఉంటే చాలా చక్కగా అనిపిస్తుంది అంటూ అభిమానులతో పాటు నెటిజన్స్‌ ఈ ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు.


పాయల్‌ చీర కట్టు ఫోటోలు గతంలో చాలా సార్లు షేర్‌ చేసింది. అయితే ఒక వివాహిత లుక్‌లు ఇలా పూలు పెట్టుకుని, బొట్టు పెట్టుకుని చీరలో మాత్రం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. చీర కట్టి పైట కొంగు జార్చడం ద్వారా కుర్రకారు గుండె జారేలా చేసింది. ఈ మధ్య కాలంలో పాయల్‌ నటించిన సినిమాలు పెద్దగా విడుదల కాలేదు. గత ఏడాది ఈమె నటించిన రక్షణ సినిమా విడుదలైంది. కానీ పెద్దగా ఆ సినిమా విజయాన్ని సొంతం చేసుకోలేక పోయింది. 2023లో వచ్చిన మంగళవారం సినిమా తర్వాత ఇప్పటి వరకు పాయల్‌ రాజ్‌ పూత్‌ నుంచి సాలిడ్‌ మూవీ రాలేదు. ఈ ఏడాదిలో ఈమె నటించిన రెండు మూడు సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

హిందీ టెలివిజన్ ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పాయల్‌ రాజ్‌ పూత్‌ హిందీ సినిమాల్లోనూ నటించింది. 2010 నుంచి బుల్లి తెరపై సందడి చేసిన పాయల్‌ రాజ్‌ పూత్‌ కి 2018లో ఆర్‌ఎక్స్‌ 100 సినిమాతో ఎంట్రీ దక్కింది. తెలుగులో వెంకీ మామ తో పాటు పలు పెద్ద సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. అంతే కాకుండా కొన్ని సినిమాల్లో ఐటెం సాంగ్స్‌ ను కూడా చేసింది. హీరోయిన్‌గా పాయల్‌ చాలా రకాల పాత్రలు చేసింది. ఎక్కువగా గ్లామర్‌ పాత్రలు చేయడం ద్వారా ఈమెలో ఉన్న నటి బయటకు రావడం లేదు. మంగళవారం సినిమాలో నటిగా విశ్వరూపం చూపించడంతో ముందు ముందు మరిన్ని అలాంటి తరహా పాత్రలు చేసే అవకాశం దక్కించుకుంటుందని అంతా భావిస్తున్నారు.