హరిహర వీరమల్లు కాస్ట్యూమ్స్ గురించి ఎవరికీ తెలియని విషయాలు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఎన్నో ఏళ్ల కిందట మొదలైన ఈ సినిమా ఎప్పుడో రిలీజవాల్సింది కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యమవుతూనే వస్తుంది.
By: Tupaki Desk | 16 May 2025 12:40 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఎన్నో ఏళ్ల కిందట మొదలైన ఈ సినిమా ఎప్పుడో రిలీజవాల్సింది కానీ పలు కారణాల వల్ల ఈ సినిమా ఆలస్యమవుతూనే వస్తుంది. ఎట్టకేలకు రీసెంట్ గానే వీరమల్లు షూటింగ్ ను పూర్తి చేసుకుంది. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో వీరమల్లు గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చిత్ర యూనిట్ నుంచి బయటికొస్తున్నాయి.
చిత్ర యూనిట్ ఈ సినిమాలోని కాస్ట్యూమ్స్ కోసం 1000 థాన్లకు పైగా కాటన్ ఫ్యాబ్రిక్ ను వాడిందట. సినిమాలో వీరమల్లుగా కనిపించనున్న పవన్ కళ్యాణ్ మూవీ మొత్తం మీద 20 కు పైగా అవుట్‌ఫిట్స్ లో కనిపించనున్నాడట. ఆ 20 కాస్ట్యూమ్స్‌లో కుర్తీ, ధోతీలే ఎక్కువగా ఉంటాయని సమాచారం. వీరమల్లులో పవన్ ధరించిన బట్టలు అతనికి సౌకర్యంగా ఉంటూనే అలనాటి సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా 90% కాటన్, 10% స్ట్రెచబుల్ స్వెడ్ తో తయారు చేశారట.
ఆ కాస్ట్యూమ్స్ తో పాటూ పవన్ మెడలో అమ్మవారు ఉండే తాయెత్తు, ఓ బ్రేస్‌లెట్, నడుమున డేగ బొమ్మ, రెడ్ కాశ్మీరీ శాలువా లాంటివి ఉంటాయని ఇప్పటికే వీరమల్లు నుంచి రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. సినిమాలోని వీరమల్లు పాత్ర కోసం వెంకటేశ్వరరావు అనే అతను 20 జతల తోలు చెప్పులను చాలా స్పెషల్ గా చేత్తోనే తయారు చేశాడట.
అంతేకాదు హరిహర వీరమల్లు కోసం సుమారు రూ. 3 కోట్ల విలువైన 500 కిలోలకు పైగా ఆభరణాలను వాడారని, అందులో పురాతన బంగారం, వెండి, విలువైన రాళ్‌లు, ముత్యాలు మరియు పూసలతో కూడిన ఆభరణాలున్నాయట. అంతేకాదు రాయల్ లుక్ రావడం కోసం నిధి అగర్వాల్ మరియు బాబీ డియోల్ కు నిజమైన ఆభరణాలనే వాడారట.