13 ఏళ్ల తర్వాత పవన్ కెరీర్ లో 2025 స్పెషల్!
జులైలో రిలీజ్ అయిన సినిమా అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. ఇప్పుడా లెక్క సరి చేయ డానికి ఇదే ఏడాది సెప్టెంబర్ లో `ఓజీ`తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
By: Srikanth Kontham | 13 Aug 2025 5:00 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 30 ఏళ్ల కెరీర్ లో చేసింది 30 సినిమాలే. అంటే ఏడాదికో సినిమా చొప్పున చేసు కుని వచ్చినట్లు! అందులో చిరంజీవి - సాయి ధరమ్ తేజ్ సినిమాలను తీసేస్తే ఆ నెంబర్ కూడా ఉండదు. ఏడాది చొప్పున డివైడ్ చేసుకుంటే? అందులో మళ్లీ వ్యత్యాసం కనిపిస్తుంది. మరి పవన్ ఒకే ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేసిన సందర్భాలున్నాయా? అంటే ఓ ఐదు సందర్భాలు కనిపిస్తున్నాయి.
తొలి ప్రయత్నం అలా:
1998 లో `సుస్వాగతం`, `తొలి ప్రేమ` చిత్రాలు రిలీజ్ అయ్యాయి. నటుడిగా పవన్ కెరీర్ మొదలైన తర్వాత ఒకే ఏడాది రెండు సినిమాలు రిలీజ్ చేయడం అన్నది అదే తొలిసారి. ఆ రెండు చిత్రాలు పవన్ కి ఎనలేని గుర్తింపును తీసుకొచ్చాయి. అతడి స్టార్ డమ్ ని రెట్టింపు చేసిన చిత్రాలవి. అటుపై మళ్లీ రెండు సినిమాలు రిలీజ్ చేయడానికి ఎనిమిదేళ్లు పట్టింది. 2006 లో మళ్లీ `బంగారం`, `అన్నవరం` చిత్రాలు రిలీజ్ అయ్యా యి. ఈ రెండు యావరేజ్ గా ఆడాయి. ఆ తర్వాత ఐదేళ్ల తర్వాత 2011 లో `తీన్ మార్`, `పంజా` చిత్రాలు ఒకే ఏడాదిలో రిలీజ్ అయ్యాయి.
గబ్బర్ సింగ్ తో లెక్క సరి:
ఈ రెండు భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యాయి. కానీ వాటిని అందుకోవడంలో విఫల మయ్యాయి. ఈ రెండు చిత్రాలు ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తాయని ట్రేడ్ అంచనా వేసింది. కానీ సాధ్యం కాలేదు. దీంతో పవన్ కూడా ఈ ప్లాప్ లను అంతే సీరియస్ గా తీసుకు న్నారు. ఈనేపథ్యంలో ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా మరుసటి ఏడాది 2012 లో నే రెండు సినిమాలు రిలీజ్ చేసారు. అవే `గబ్బర్ సింగ్`, `కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు`. వీటిలో గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అవ్వగా రాంబాబు మాత్రం తడాఖా చూపించలేకపోయాడు.
కలిసి రాని తొలి పాన్ ఇండియా:
కానీ `గబ్బర్ సింగ్` సక్సస్ తో అన్ని ప్లాప్ లు పటా పంచల్ అయ్యాయి. గబ్బర్ సింగ్ విజయంతో పవన్ రేంజ్ మళ్లీ తారా స్థాయికి చేరింది. మార్కెట్ కూడా రెట్టింపు అయింది. ఆ తర్వాత మళ్లీ చాలా కాలం పాటు ఒకే ఏడాది రెండు రిలీజ్ ల జోలికి వెళ్లలేదు. మళ్లీ 13 ఏళ్ల తర్వాత 2025 లో `హరిహరవీరమల్లు` తో ప్రేక్ష కుల ముందుకొచ్చారు. పవన్ కెరీర్ లో ఇదే తొలి పాన్ ఇండియా సినిమా. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాంటి ఫలితాలు సాధించిందో తెలిసిందే.
ఓజీపైనే ఆశలన్నీ:
జులైలో రిలీజ్ అయిన సినిమా అంచనాలు అందుకోవడంలో విఫలమైంది. ఇప్పుడా లెక్క సరి చేయ డానికి ఇదే ఏడాది సెప్టెంబర్ లో `ఓజీ`తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. గ్యాంగ్ స్టర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో అంచనాలు ఆకాశా న్నంటుతున్నాయి. పవన్ అభిమానులు కాలరెగరేసే సినిమాగా `ఓజీ`ని భావిస్తున్నారు. మరో సినిమా ఉస్తా భగత్ సింగ్ కూడా శర వేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటుంది. అన్ని అనుకున్నట్లు జరిగితే డిసెంబర్ లో డేట్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఆ రకంగా 2025 పవన్ కెరీర్ లో మరో స్పెషల్ గా చెప్పొచ్చు.