పాకిస్తాన్ దుస్థితిపై స్థానిక నటి సంచలన వ్యాఖ్యలు
సబా మీడియాతో మాట్లాడేప్పుడు తీవ్ర ఉద్వేగానికి లోనవ్వడమే గాక కంట తడి కూడా పెట్టుకున్నారు.
By: Tupaki Desk | 29 April 2025 9:55 PM ISTప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా పాకిస్తానీలకు అవమానాలు తప్పడం లేదని తీవ్ర ఆవేదనను కనబరిచారు పాక్ నటి సభా కమర్. ఓసారి షూటింగ్ కోసం జార్జియాలోని టిబిసిలికి వెళ్లగా, ఎయిర్ పోర్ట్ లో భారతీయులను అనుమతించారు కానీ నన్ను ఆపారు. పాస్ పోర్ట్ సహా అన్నీ చెక్ చేసాకే నన్ను లోనికి అనుమతించారు.. దానికి ముందు ఎన్నో ప్రశ్నలు వేసారు! అని ఆవేదన వ్యక్తం చేసారు. మా దేశంలో పాకిస్తాన్ జిందాబాద్ అని అంటాం. కానీ బయటికి వెళ్లినప్పుడే పాకిస్తాన్ పరిస్థితి ఏమిటన్నది అర్థమవుతుంది.. అని వ్యాఖ్యానించారు. సబా మీడియాతో మాట్లాడేప్పుడు తీవ్ర ఉద్వేగానికి లోనవ్వడమే గాక కంట తడి కూడా పెట్టుకున్నారు.
'హిందీ మీడియం' లాంటి బ్లాక్ బస్టర్ చిత్రంతో పాకిస్తాన్ నటి సబా కమర్ బాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఈ చిత్రంలో దీపక్ డోబ్రియాల్, అమృతా సింగ్ తదితరులు నటించారు. ఇది భారతదేశంలో రూ.70 కోట్ల నికర ఆదాయం ఆర్జించింది. ప్రపంచవ్యాప్తంగా రూ.110 కోట్లు వసూలు చేసింది. 2018 ఏప్రిల్ 4న చైనాలో హిందీ మీడియం విడుదలై రూ.220 కోట్లు వసూలు చేసింది. ఆ విధంగా హిందీ మీడియం ప్రపంచవ్యాప్త వసూళ్లు రూ.330 కోట్లకు చేరుకున్నాయి. ఇది అత్యంత లాభదాయకమైన హిందీ చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
మాడాక్ ఫిల్మ్స్ - టి-సిరీస్ బ్యానర్‌లపై దినేష్ విజన్ -భూషణ్ కుమార్ హిందీ మీడియంను నిర్మించారు. ఈ చిత్రానికి సాకేత్ చౌదరి దర్శకత్వం వహించారు. సాకేత్ గతంలో 2006 రొమాంటిక్ కామెడీ ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్ , దాని 2014 సీక్వెల్ షాదీ కే సైడ్ ఎఫెక్ట్స్‌కు దర్శకత్వం వహించారు. 2021లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఆంకాహి కహానియా అనే వెబ్ సిరీస్ లో ఒక భాగానికి ఆయన దర్శకత్వం వహించారు.