పిక్‌టాక్ : పాయల్ చేతిలో అది ఉందేంటి?
టాలీవుడ్‌లో ఆర్‌ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్‌పూత్ పలు సినిమాల్లో నటించింది. మొదటి సినిమాలోనే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది.
By: Tupaki Desk | 24 Jun 2025 4:18 PM ISTటాలీవుడ్‌లో ఆర్‌ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్‌పూత్ పలు సినిమాల్లో నటించింది. మొదటి సినిమాలోనే నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. బోల్డ్‌గా నటించడానికి హీరోయిన్స్ ఆసక్తి చూపించరు, అలాంటి పాత్రలను చేయడానికి హీరోయిన్స్ భయపడుతారు. కానీ పాయల్ రాజ్‌పూత్ మాత్రం చాలా ఉత్సాహంగా అలాంటి పాత్రలను పదే పదే చేస్తూ ఉంటుంది అని విశ్లేషకులు అంటూ ఉంటారు. ఆమె ఘట్స్‌కి కచ్చితంగా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. పాయల్ చేసిన మంగళవారం సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో మనం చూశాం. ఆ సినిమాలో హీరోయిన్ పాత్రకు మరే హీరోయిన్ ఒప్పుకునే పరిస్థితి ఉండదు. కేవలం పాయల్ మాత్రమే ఆ పాత్రకు న్యాయం చేసింది.
పాయల్ సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయంతో లేదా ఫోటోలు, వీడియోలతో వైరల్ అవుతూ ఉంటుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే ఈసారి తన స్కిన్ షో తో లేదా మరేదైనా సినిమా వార్తతో కాకుండా తన చేతిలో ఉన్న స్టీల్ క్యారేజ్ కారణంగా వార్తల్లో నిలిచింది. ఎయిర్ పోర్ట్‌లో స్టీల్ క్యారేజ్‌తో పాయల్ కనిపించింది. సాధారణంగా పల్లెటూర్లలో వ్యవసాయ పనులకు లేదా మరేదైనా రోజువారీ పనులకు వెళ్లే వారు అలాంటి క్యారేజ్‌లను వినియోగిస్తూ ఉంటారు. అలాంటి క్యారేజ్‌ను పాయల్ రాజ్ పూత్ చేతిలో చూసి చాలా మంది అవాక్కవుతున్నారు. ఎయిర్ పోర్ట్‌లో చాలా మంది ఆమె ఫోటోలను తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా ఇంటి భోజనం కావాలి అనుకునే వారు క్యారియర్ మెయింటెన్ చేస్తారు. అయితే అది ఇంత ఓపెన్‌గా ఉండదు. కొందరు బ్యాక్‌లో ఆ క్యారియర్ ను పట్టుకుంటే, మరికొందరు ప్లాస్టిక్ క్యారియర్‌ను స్టైల్‌గా పట్టుకుంటారు. కానీ ఇలా స్టీల్ క్యారేజ్‌ను మాత్రం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. అది కూడా హీరోయిన్ చేతిలో ఇలాంటి ఒక క్యారేజ్, అది కూడా ఎయిర్ పోర్ట్‌లో ఆమె ఉన్న సమయంలో ఆమె చేతిలో ఉన్న కారణంగా వార్తలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. పాయల్ ఏదైనా ప్రాంతానికి షూటింగ్ కోసం వెళ్తూ ఉంటుంది. అక్కడ ఫుల్ వల్ల ఇబ్బంది పడటం ఎందుకు అనే ఉద్దేశంతో తన ఇంటి నుంచి ఫుడ్‌ను తీసుకుని వెళ్తూ ఉంటుందని కొందరు అంటున్నారు.
పంజాబీ మూవీ చన్నా మెరేయా తో 2017లో ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్‌పూత్ మొదటి సినిమాతోనే ఫిలింఫేర్ పంజాబీ అవార్డును సొంతం చేసుకుంది. 2018లో వీరే కి వెడ్డింగ్ సినిమాతో బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. బాలీవుడ్, పంజాబీ సినిమాల కంటే ఈమె తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించింది. కన్నడ, తమిళ భాషల్లోనూ అప్పుడప్పుడు ఈమె సినిమాలు చేస్తూ వచ్చింది. ఆకట్టుకునే అందంతో పాటు, యాక్టింగ్‌లో ప్రతిభ కనబర్చగల సత్తా ఉన్న నటి కావడంతో ఇండస్ట్రీలో దశాబ్ద కాలం కావస్తున్నా బిజీగానే ఉంది. తెలుగులో ఈమె రెండు సినిమాలకు త్వరలో సైన్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకు సంబంధించిన ప్రకటన రావాల్సి ఉంది. ఐటెం సాంగ్స్ చేసేందుకు కూడా పాయల్ రెడీగా ఉంది.