Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు హృతిక్ స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న క్రేజీ బాలీవుడ్ మూవీ `వార్ 2`. హృతిక్ రోష‌న్ మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

By:  Tupaki Desk   |   16 May 2025 12:40 PM IST
ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు హృతిక్ స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్?
X

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న క్రేజీ బాలీవుడ్ మూవీ `వార్ 2`. హృతిక్ రోష‌న్ మ‌రో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. య‌ష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివ‌ర్స్‌లో భాగంగా `వార్‌`కు సీక్వెల్‌గా దీన్ని అయాన్ ముఖ‌ర్జీ తెర‌కెక్కిస్తున్నాడు. ఈ మూవీతో ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్‌కు ప‌రిచ‌యం అవుతున్న విష‌యం తెలిసిందే. జ‌క్క‌న్న అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందించిన RRRతో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఎన్టీఆర్ పాపుల‌ర్ అయ్యారు. అంతే కాకుండా ప‌లువురు హాలీవుడ్ డైరెక్ట‌ర్ల దృష్టిలో ప‌డ్డారు.

` గార్డియ‌న్స్ ఆఫ్ ది గెలాక్సీ` డైరెక్ట‌ర్ జేమ్స్ గ‌న్ త‌న‌కు ఎన్టీఆర్‌తో సినిమా చేయాల‌ని ఉంద‌ని త‌న మ‌న‌సులోని కోరిక‌ను బ‌య‌ట‌పెట్టారు. ఇంత‌టి క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్‌పై బాలీవుడ్ క‌న్ను ప‌డింది. వెంట‌నే రంగంలోకి దిగిన య‌ష్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా, ద‌ర్శ‌కుడు అయాన్ మ‌ముఖ‌ర్జీ త‌మ `వార్ 2` మూవీ కోసం ఎన్టీఆర్‌ను సంప్ర‌దించ‌డం, క్యారెక్ట‌ర్ న‌చ్చ‌డంతో ఎన్టీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేయ‌డం తెలిసిందే. ఎన్టీఆర్ తొలిసారి చేస్తున్న బాలీవుడ్ మూవీ కావ‌డం, య‌ష్ రాజ్ స్పై యూనివ‌ర్స్‌లో భాగంగా వ‌స్తున్న సినిమా కావ‌డంతో `వార్ 2`పై స‌హ‌జంగానే అంచ‌నాలు తారా స్థాయికి చేరుకున్నాయి.

షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకున్న ఈ మూవీని ఆగ‌స్టు 14న భారీ స్థాయిలో పాన్ వర‌ల్డ్ మూవీగా రిలీజ్ చేయాల‌ని య‌ష్ రాజ్ ఫిలింస్ సంస్థ భారీగా ప్లాన్ చేస్తోంది. దీంతో ఈ మూవీ టీమ్ నుంచి ఎప్పుడెప్పుడు ఫ‌స్ట్ లుక్, లేదా గ్లింప్స్‌, టీజ‌ర్ రిలీజ్ అవుతుందా అని అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం టీజ‌ర్ రిలీజ్ అయితే బాగుంటుంద‌ని ఆశ‌గా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని టీమ్ ఓ స్పెష‌ల్ గిఫ్ట్‌ని ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు అందించాల‌ని ప్లాన్ చేస్తోంద‌ట‌.

ఈ నేప‌థ్యంలో హీరో హృతిక్ రోష‌న్ పెట్టిన పోస్ట్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఒక విధంగా చెప్పాలంటే ఆ పోస్ట్‌తో హృతిక్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ప్రామిస్ చేసిన‌ట్టుగా చెబుతున్నారు. `హే తార‌క్..ఈ పంవ‌త్స‌రం మే 20న ఏం జ‌ర‌గ‌బోతోందో అంచ‌నా వేయ‌గ‌ల‌రా? న‌మ్మండి క‌చ్చితంగా అంచ‌నా వేయ‌లేరు. రెడీగా ఉండండి` అంటూ ఎన్టీఆర్ పుట్టిన రోజుని టీజ‌ర్‌తో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ని స‌ర్‌ప్రైజ్ చేయ‌బోతున్నామ‌ని హృతిక్ ప్రామిస్ చేశాడ‌ని ఫ్యాన్స్ సంబ‌రాలు మొద‌లు పెట్టారు.

ఇదిలా ఉంటే ఆగ‌స్టు 14న భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడ అవుతున్న ఈ మూవీ ఫ‌స్ట్ డే రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టే అవ‌కాశం ఉంద‌ని, ఇండియా వైడ్‌గా రూ.100 కోట్లు, ఓవ‌ర్సీస్‌లో రూ.50 కోట్ల‌ని తొలి రోజే సాధించి చ‌రిత్ర సృష్టించ‌బోతోంద‌ని బాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. అదే జ‌రిగితే ఎన్టీఆర్ తొలి బాలీవుడ్ మూవీ `వార్ 2` స‌రికొత్త రికార్డుల‌ను నాంది ప‌ల‌క‌డం ఖాయం.