ఎన్టీఆర్ కూడా రిటర్న్ గిఫ్ట్ ప్లాన్ చేశాడటగా!
ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతే కాకుండా ఎన్టీఆర్ నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ కావడంతో ట్రేడ్ వర్గాలే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
By: Tupaki Desk | 16 May 2025 3:47 PM ISTబాలీవుడ్ క్రేజీ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న భారీ స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ `వార్ 2`. యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లో వస్తున్న ఈ మూవీకి `బ్రహ్మాస్త్ర` ఫేమ్ అయాన్ ముఖర్జీ రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంతే కాకుండా ఎన్టీఆర్ నటిస్తున్న తొలి బాలీవుడ్ మూవీ కావడంతో ట్రేడ్ వర్గాలే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
పాన్ ఇండియా మూవీకి మించి క్రేజ్‌ని సొంతం చేసుకున్న ఈ సినిమా కోసం యాత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూఏస్తున్నారు. అంతే కాకుండా ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ఎప్పుడెప్పుడు వచ్చేస్తుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. వారి ఎదురు చూపులకు తెర దించుతూ చిత్ర బృందం ఈ నెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సర్‌ప్రైజ్ ఇవ్వడానికి రెడీ అవుతోంది. శుక్రవారం ఎన్టీఆర్ అభిమానులకు ఈ నెల 20న సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నామని హృతిక్ రోషన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం తెలిసిందే.
దీని కోసం ఎదురు చూడమంటూ హింట్ ఇచ్చాడు. ఈ పోస్ట్‌కు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ తనదైన స్టైల్లో రిప్లై ఇవ్వడం నెట్టింట వైరల్‌గా మారింది. `కబీర్...నిన్ను వేటాడి నీకు ప్రత్యేక బహుమతి ఇచ్చేందుకు వేచి చూస్తున్నా` అని ఎన్టీఆర్ రిప్లై ఇచ్చాడు. అయితే ఎన్టీఆర్ ఇచ్చిన రిప్లైలో కీలక విషయం ఒకటి బయటపడింది. ఇందులో హృతిక్ రోషన్ ని వెంటాడే పవర్‌ఫుల్ రా ఏజెంట్‌గా ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉండే అవకాశం ఉందని స్పష్టమవుతోంది.
ఆ విషయాన్ని ఇండైరెక్ట్‌గా చెబుతూ ఎన్టీఆర్ పోస్ట్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో మాట్ టాపిక్‌గా మారిన ఈ మూవీని ఆగస్టు 14న బారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా బిజినెస్ కూడా రికార్డు స్థాయిలో జరిగినట్టుగా బాలీవుడ్ వర్గాల సమాచారం. తెలుగు డబ్బింగ్ హక్కులకు భారీ పోటీనెలకొందని దాదాపు రూ.100 కోట్లకు పైనే బిజినెస్ జరుగుతున్నట్టుగా బాలీవుడ్ టాక్.