ఎన్టీఆర్ నీల్ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
ఆర్ఆర్ఆర్, దేవర సినిమాలతో తన క్రేజ్ ను విపరీతంగా పెంచుకున్న ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి వార్2 సినిమా చేసి ఆ సినిమాతో బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు.
By: Tupaki Desk | 29 April 2025 2:40 PM ISTఆర్ఆర్ఆర్, దేవర సినిమాలతో తన క్రేజ్ ను విపరీతంగా పెంచుకున్న ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి వార్2 సినిమా చేసి ఆ సినిమాతో బాలీవుడ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. వార్2 షూటింగ్ ను ఆల్రెడీ ఫినిష్ చేసుకున్న ఎన్టీఆర్ రీసెంట్ గా కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లిన విషయం తెలిసిందే.
ప్రశాంత్ నీల్- ఎన్టీఆర్ సినిమా ఎప్పుడో పూజా కార్యక్రమాలు జరుపుకున్నప్పటికీ ఎన్టీఆర్ వార్2 షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల ఎన్టీఆర్ లేని సీన్స్ ను ప్రశాంత్ నీల్ తెరకెక్కించాడు. వారం కిందటే ఎన్టీఆర్ కూడా బెంగుళూరు వెళ్లి ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. సలార్ తర్వాత నీల్ నుంచి వస్తున్న సినిమా కావడం, ఎన్టీఆర్ మాస్ హీరో అవడంతో ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలున్నాయి.
ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఎప్పుడూ లేనంత స్లిమ్ గా తయారవడంతో పాటూ మరింత స్టైల్ గా మేకోవర్ అయ్యాడు. ప్రశాంత్ నీల్ ఈ సినిమాలో ఎన్టీఆర్ ను చాలా కొత్త అవతారంలో చూపించనున్నాడని తెలుస్తోంది. వాస్తవానికి ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తామని మేకర్స్ ముందే చెప్పారు కానీ ఇప్పుడు సినిమా వాయిదా పడింది.
షూటింగ్ లేట్ గా మొదలవడంతో ఎన్టీఆర్-నీల్ సినిమా వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఈ సినిమాను 2026, జూన్ 25న రిలీజ్ చేయనున్నట్టు చిత్ర మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ అప్డేట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో ఒక్కసారిగా జోష్ ను నింపింది. ఆల్రెడీ సంక్రాంతికి పోటీ విపరీతంగా ఉన్న నేపథ్యంలో ఈ డేట్ అయితే అన్నింటికీ బావుంటుందని అందరూ భావిస్తున్నారు.
ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను పరిశీలిస్తుండగా, డ్రాగన్ సినిమా షూటింగ్ ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతుంది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను నీల్ అక్కడ తెరకెక్కిస్తున్నాడని సమాచారం. ఇదిలా ఉంటే మే 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా సినిమా నుంచి గ్లింప్స్ ను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారని తెలుస్తోంది.