యష్, ప్రభాస్ లానే ఎన్టీఆర్ కూడా!
అందుకే రుక్మిణి ఈ సినిమాను ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఈ విషయం నిరాశనే మిగులుస్తుంది.
By: Tupaki Desk | 29 April 2025 9:02 PM ISTయాక్షన్ సినిమాల్లో ప్రశాంత్ నీల్ ఓ సరికొత్త ట్రెండే సృష్టించాడు. అతని దర్శకత్వంలో వచ్చిన కెజిఎఫ్, కెజిఎఫ్2, సలార్ సినిమాలన్నింటిలో నీల్ యాక్షన్‌కే పెద్ద పీట వేశాడు. ఆ సినిమాల్లో హీరోయిన్లు ఉన్నప్పటికీ వారిని సరిగా వాడుకోడు నీల్. దానికి కారణం అతను గ్లామర్ ను లైట్ తీసుకోవడమే అని ప్రత్యేకంగా చెప్పే పన్లేదు.
కెజిఎఫ్ ఫ్రాంచైజ్ సినిమాలతో పాటూ ప్రభాస్ తో చేసిన సలార్ లో కూడా నీల్ ఇదే ఫాలో అయ్యాడు. కెజిఎఫ్ లో కనీసం హీరోహీరోయిన్లకు కొన్ని సీన్స్, ఓ పాటైనా ఉంటుంది కానీ సలార్ లో అవి కూడా ఉండవు. ఇప్పుడు ఎన్టీఆర్ తో నీల్ చేస్తున్న డ్రాగన్ విషయంలో కూడా నీల్ అదే ఫార్ములాని ఫాలో కాబోతున్నట్టు తెలుస్తోంది.
డ్రాగన్ మూవీలో హీరోయిన్ గా రుక్మిణి వసంత్ ఇప్పటికే ఫిక్స్ అయిందంటున్నారు. రుక్మిణి వసంత్ గ్లామర్ హీరోయిన్ కాదు. పద్దతైన పాత్రలు చేసే చాలా క్లాస్ హీరోయిన్. డ్రాగన్ లో కూడా రుక్మిణి అలాంటి పాత్రలోనే కనిపించనుందట. అందుకే రుక్మిణి ఈ సినిమాను ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఈ విషయం నిరాశనే మిగులుస్తుంది.
తమ హీరో సినిమా వస్తుందంటే ఎవరైనా సరే ఆ సినిమాలో డ్యాన్సులు, ఫైట్లు, రొమాన్స్ గురించి మాట్లాడుకుంటారు. కానీ నీల్ ఎన్టీఆర్ తో చేయబోయే డ్రాగన్ లో ఫైట్స్ తప్ప మరేం పెట్టట్లేదు. ఫ్యాన్స్ కోసం ఓ ఐటెం సాంగ్ ఉంటుందన్నారు కానీ ఇప్పుడు అది కూడా లేదు. డ్రాగన్ సినిమాను నీల్ ఎప్పటిలానే తన తరహా యాక్షన్ మూవీగా రూపొందిస్తున్నట్టు సమాచారం.
డ్రాగన్ మొత్తం యాక్షన్ ప్రధానంగా ఉంటుందని, లేడీ క్యారెక్టర్లు సినిమాలో చాలా తక్కువగా కనిపించనున్నాయని, హీరోయిన్ పాత్ర కూడా చాలా ట్రెడిషనల్ గా ఉంటూనే, తక్కువ నిడివితో ఉంటుందని నీల్ సన్నిహితులంటున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి మే 20న గ్లింప్స్ రిలీజయ్యే ఛాన్సుంది.