Begin typing your search above and press return to search.

వీడియో : మాస్‌కి పిచ్చెక్కించే 'వార్‌ 2' విజువల్స్‌

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ హృతిక్ రోషన్‌, టాలీవుడ్‌ స్టార్‌ ఎన్టీఆర్‌ కలిసి నటించిన 'వార్‌ 2' మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

By:  Ramesh Palla   |   13 Aug 2025 3:40 PM IST
వీడియో : మాస్‌కి పిచ్చెక్కించే వార్‌ 2 విజువల్స్‌
X

బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ హృతిక్ రోషన్‌, టాలీవుడ్‌ స్టార్‌ ఎన్టీఆర్‌ కలిసి నటించిన 'వార్‌ 2' మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వార్‌ 2 తో ఎన్టీఆర్‌ బాలీవుడ్‌లో అడుగు పెట్టబోతున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో వచ్చిన పాపులారిటీ నేపథ్యంలో వార్‌ 2 లో ఎన్టీఆర్‌ నటిస్తున్నాడు అనగానే హిందీ ప్రేక్షకుల్లో విపరీతమైన బజ్‌ క్రియేట్‌ అయింది. హృతిక్‌ వంటి సూపర్‌ స్టార్‌తో ఎన్టీఆర్‌ జత కట్టడంతో వార్‌ 2పై సౌత్‌ ఆడియన్స్‌లో ముఖ్యంగా తెలుగు ఆడియన్స్‌లో అంచనాలు భారీగా పెరిగాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్‌ ఫిల్మ్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ స్పై థ్రిల్లర్‌ మూవీ సరికొత్త యాక్షన్ వరల్డ్‌లోకి ప్రేక్షకులను తీసుకు వెళ్తుందని ట్రైలర్‌ ను చూస్తే అనిపించింది. ఈ సినిమా పై మరింతగా అంచనాలు పెంచే విధంగా రిలీజ్‌ యాక్షన్‌ ప్రోమోను మేకర్స్‌ విడుదల చేశారు.

వార్‌ 2 నుంచి మాస్‌ ఫ్యాన్స్‌ కోసం టీజర్‌

రిలీజ్‌ యాక్షన్‌ ప్రోమోతో సినిమా స్థాయి మరింతగా పెరిగింది. వార్‌ 2 లో ఉండబోతున్న యాక్షన్ ట్రీట్‌, ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ల డాన్స్ ట్రీట్‌, కియారా అద్వానీ బికినీ ట్రీట్‌ను కేవలం ముప్పై సెకన్ల ప్రోమోలో చూపించడం జరిగింది. హృతిక్‌ రోషన్‌ ఈ వీడియోను ఎక్స్ ద్వారా షేర్‌ చేయడం జరిగింది. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ ఫైట్‌ గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. అంతే కాకుండా ఇద్దరి కాంబోలో ఉండే పాట గురించి కూడా ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఈ రెండు విజువల్స్‌ను ఈ ప్రోమోలో ఉండేలా ప్లాన్‌ చేయడం ద్వారా వార్‌ 2 మాస్‌ ఆడియన్స్‌కి పిచ్చేక్కిండం ఖాయం అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. కియారా అద్వానీ బికినీ ట్రీట్‌ మరోసారి ఈ వీడియోతో వైరల్‌ కానుంది.

ఎన్టీఆర్‌, హృతిక్‌ రోషన్‌ల భారీ స్పై థ్రిల్లర్‌

సినిమా గ్రాండ్‌గా ఉంటుంది, యాక్షన్ సన్నివేశాలు గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఉంటాయి అంటూ అయాన్ ముఖర్జీ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. ఈ మధ్య కాలంలో యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై యూనివర్శ్‌ నుంచి వచ్చిన కొన్ని సినిమాలు నిరాశ పరిచాయి. వాటన్నింటికి సమాధానంగా వార్‌ 2 నిలుస్తుందని, ఇప్పటి వరకు వచ్చిన స్పై థ్రిల్లర్‌లతో పోల్చితే ఈ సినిమా మరింత విభిన్నంగా ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేసే విధంగా ఉంటుందని అంటున్నారు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ స్పై థ్రిల్లర్స్‌ లో ఇది అతి పెద్ద సినిమాగి నిలుస్తుందని, అంతే కాకుండా వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించడం ద్వారా సరికొత్త రికార్డ్‌లను క్రియేట్‌ చేయబోతుంది అంటున్నారు. ఈ సినిమా రికార్డ్‌ బ్రేకింగ్‌ ఓపెనింగ్స్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కూలీతో బిగ్‌ ఫైట్‌ కి వార్‌ 2 సిద్దం

తెలుగు రాష్ట్రాల్లో వార్‌ 2 సినిమాను భారీ ఎత్తున విడుదల చేయబోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సినిమాకు అదనపు టికెట్‌ రేట్లకు అనుమతి ఇవ్వలేదు. కానీ ఏపీలో మాత్రం ఈ సినిమా టికెట్ల రేట్లు పెంచుకునేందుకు గాను అనుమతి ఇవ్వడం జరిగింది. దాంతో ఏపీలో ఈ సినిమా భారీ ఓపెనింగ్ పై కన్నేసింది. తెలంగాణలోనూ దేవర సినిమాను ఏ స్థాయిలో విడుదల చేశారో అదే స్థాయిలో విడుదల చేయడం ద్వారా దాదాపుగా ఆ స్థాయి ఓపెనింగ్‌ దక్కుతుందని అంతా భావిస్తున్నారు. మొత్తానికి వార్‌ 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్‌ రాబట్టే విధంగా నిర్మాత నాగ వంశీ ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఎన్టీఆర్‌ పై అభిమానంతో ఈ సినిమాను ఆయన డబ్బింగ్‌ హక్కులు కొనుగోలు చేయడం జరిగింది. వార్‌ 2 కి పోటీగా సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూలీ సినిమా రాబోతుంది. ఆ సినిమా ఇప్పటికే భారీ ప్రీ సేల్‌ ద్వారా వసూళ్లు రాబట్టింది. వార్‌ 2 కి తమిళనాడుతో పాటు నార్త్‌లోనూ అక్కడక్కడ కాస్త పోటీ తీవ్రంగా ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.