ఎన్టీఆర్ (X) హృతిక్: కాలర్ ఎగరేస్తే 1000 కోట్లు?
అంతేకాదు.. లక్షలాదిగా అభిమానులు వీక్షిస్తుండగా ఎన్టీఆర్ కాలర్ ఎగరేస్తుంటే, అతడి వద్దకు వచ్చిన హృతిక్ కూడా కాలరెత్తాడు!
By: Sivaji Kontham | 11 Aug 2025 10:14 AM ISTవేలాది మంది అభిమానులు కొలువు దీరిన వేదిక సాక్షిగా, లక్షలాది మంది టీవీక్షకుల ఎదుట.. ఒక స్టార్ హీరో ఎగ్రెస్సివ్‌గా తన కాలర్ ఎగరవేసే సాహసం చేసారంటే ఎన్ని గట్స్ ఉండాలి. ఈ హీరోకి నిజంగా ఎన్ని గుండెలు? ఇంత కాన్ఫిడెంట్‌గా ఎలా కాలర్ ఎగరేయగలడు? ఒకవేళ సినిమా ఫలితం తిరకాసు అయితే..! ఇలాంటి సందేహాలు, విమర్శలు ఎదురవ్వడం చాలా సహజం.
కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే, అతడు కాలర్ ఎగరవేసిన తీరు చూస్తుంటే `వార్ 2` బంపర్ హిట్ కొడుతుందా? అనే సందేహం కలగక మానదు. ఇది కేవలం ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపడానికి ఉద్ధేశించినది మాత్రమే కాదు... ఇది కచ్ఛితంగా వార్ 2లో కంటెంట్ పై ఉన్న నమ్మకం అయ్యి ఉండొచ్చు. ముఖ్యంగా వార్ 2లో ఎన్నో ట్విస్టులు, మలుపులు ఉత్కంఠ కలిగిస్తాయని తారక్ ప్రీరిలీజ్ వేడుకలో అన్నారు. ఫ్యాన్స్ ని థ్రిల్ చేసే ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయని థియేటర్లలో దానిని ఆస్వాధించాలని కూడా కోరారు. అంతేకాదు.. ఈ ట్విస్టులు మలుపులను లీక్ చేయొద్దని ఫ్యాన్స్ ని హెచ్చరించాడు. అయాన్ ముఖర్జీ ఈ చిత్రాన్ని అద్బుతంగా తెరకెక్కించారని, అతడు తప్ప ఇంకెవరూ ఇలాంటి సినిమా తీయలేరని కూడా తన దర్శకుడికి కితాబిచ్చారు.
అంతేకాదు.. లక్షలాదిగా అభిమానులు వీక్షిస్తుండగా ఎన్టీఆర్ కాలర్ ఎగరేస్తుంటే, అతడి వద్దకు వచ్చిన హృతిక్ కూడా కాలరెత్తాడు! ఆ ఇద్దరు హీరోలు రెండు వైపులా కాలర్లు ఎత్తి చూపిస్తూ, ఫ్యాన్స్ ఎదుట తమ కాన్ఫిడెన్స్ ని ప్రదర్శించారు. నిజంగానే వార్ 2లో అంత దమ్ము ఉందా? క్రిష్, ధూమ్ సిరీస్ లను మించే ట్రీట్ వార్ 2 ఇస్తుందా? ఆ స్థాయి కంటెంట్ ని అయాన్ ముఖర్జీ ఈ చిత్రంలో చూపిస్తున్నాడా? బాహుబలి 2, కేజీఎఫ్, ఆర్.ఆర్.ఆర్, పుష్ప 2 తర్వాత 1000 కోట్ల క్లబ్ లో చేరే దమ్ము ఈ చిత్రానికి ఉందా? .. వేచి చూడాలి. దక్షిణాది మార్కెట్లను కొల్లగొట్టాలన్న యష్ రాజ్ ఫిలింస్ వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో కూడా వేచి చూడాల్సి ఉంది.