Begin typing your search above and press return to search.

వీడియో : ఎయిర్‌ పోర్ట్‌లో హీరోయిన్‌ కన్నీళ్లు..!

నోరా ఫతేహీ ఎయిర్‌ పోర్ట్‌లో కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

By:  Tupaki Desk   |   7 July 2025 10:28 PM IST
వీడియో : ఎయిర్‌ పోర్ట్‌లో హీరోయిన్‌ కన్నీళ్లు..!
X

ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది హీరోల, హీరోయిన్స్ ఫోటోలను మీడియా ఫోటోగ్రాఫర్స్‌ ఎయిర్‌ పోర్ట్‌లో తీసేందుకు పోటీ పడుతున్నారు. పబ్లిక్ ఈవెంట్స్‌ లో కంటే ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ఎక్కువగా ఎయిర్ పోర్ట్‌లో కనిపిస్తున్నారు. అందుకే ఎయిర్‌ పోర్ట్‌ బయట పదుల సంఖ్యలో మీడియా ఫోటోగ్రాఫర్స్‌ ఉంటున్నారు. వారిని తప్పించుకుని కొందరు సెలబ్రిటీలు ఎయిర్‌ పోర్ట్‌ నుంచి బయటకు రావడం, లోనికి వెళ్లడం చేస్తున్నారు. కొందరు వారిని తప్పించుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ఫోటోగ్రాఫర్స్‌ మాత్రమే కాకుండా అభిమానులం అంటూ చాలా మంది సెల్ఫీల కోసం ఎగబడుతూ ఉంటారు. ఎయిర్‌ పోర్ట్‌లో సెలబ్రిటీలకు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.

ఇటీవల బాలీవుడ్‌ హీరోయిన్‌, ఐటెం సాంగ్స్‌లో నటించి మెప్పించిన నోరా ఫతేహీ ముంబై ఎయిర్‌ పోర్ట్‌లో కనిపించింది. గతంలోనూ చాలా సార్లు నోరా ఫతేహీ ముంబై ఎయిర్‌ పోర్ట్‌లో కనిపించింది, ఆ సమయంలో ఫోటోగ్రాఫర్‌లతో మాట్లాడుతూ, వారి కోసం ఫోటోలకు ఫోజ్‌లు ఇవ్వడం జరిగింది. అంతే కాకుండా ఎయిర్‌ పోర్ట్‌లో ఎదురు పడి సెల్ఫీలు అడిగిన ఫ్యాన్స్‌కి కూడా సెల్ఫీలు ఇచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఇటీవల ఆమె ఎయిర్‌ పోర్ట్‌లో ఆమె ఫోటోగ్రాఫర్స్‌కి కంట పడకుండా వెళ్లింది. అదే సమయంలో అక్కడ ఉన్న ఒక అభిమాని సెల్ఫీ అడుగుతున్నా పట్టించుకోకుండా పోయింది. ఆ సమయంలో నోరా ఫతేహీ కన్నీళ్లు పెట్టుకోవడం వీడియోలో రికార్డ్‌ అయింది.

నోరా ఫతేహీ ఎయిర్‌ పోర్ట్‌లో కన్నీళ్లు పెట్టుకున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఎందుకు నోరా అలా కన్నీళ్లు పెట్టుకుంది అంటూ చాలా మంది చర్చించుకుంటున్నారు. సెల్ఫీ అడిగిన వ్యక్తిని నోరా ఫతేహీ వ్యక్తిగత సిబ్బంది దురుసుగా పక్కకు తోసి వేశాడు. అంతే కాకుండా ఏ సమయంలో ఎలా ఉండాలో తెలియదా అన్నట్లుగా అసహనం వ్యక్తం చేశాడు. నోరా ఫతేహీ కన్నీళ్లు పెట్టుకుంటున్న విషయం తెలియక అభిమాని సెల్ఫీ కోసం అడిగినట్లుగా ఉన్నాడు. ఆమె ఎమోషన్‌ను అర్థం చేసుకోకుండా ఎవరైనా అలా సెల్ఫీ కోసం వెళ్లడం ఖచ్చితంగా మంచి పద్దతి కాదని సోషల్‌ మీడియాలో ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.

కెనడియన్‌ డాన్సర్‌గా ఇండియన్‌ సినిమా రంగంలో అడుగు పెట్టిన నోరా ఫతేహీ రోర్‌ : టైగర్స్ ఆఫ్‌ ది సుందర్భన్స్ అనే హిందీ సినిమాతో పరిచయం అయింది. తెలుగులో టెంపర్‌, బాహుబలి, కిక్‌ 2 వంటి సినిమాల్లో ఐటెం సాంగ్స్ చేయడం ద్వారా టాలీవుడ్‌ ప్రేక్షకులకు చేరువ అయింది. 2016లో రియాలిటీ టెలివిజన్‌ డాన్స్ షో ఝలక్ దిఖ్లా జా లో పాల్గొంది. బిగ్‌ బాస్‌ కార్యక్రమంలోనే నోరా ఫతేహీ పాల్గొనడం ద్వారా హిందీ బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలిగా నిలిచింది. బుల్లి తెర నుంచి వెండి తెరపై కూడా ఎన్నో విజయాలను సొంతం చేసుకోవడం ద్వారా దేశవ్యాప్తంగా ఈ అమ్మడికి మంచి గుర్తింపు లభించింది. ఆ మధ్య ఒక తెలుగు సినిమా కు నోరా ఫతేహీ ఓకే చెప్పిందనే వార్తలు వచ్చాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.