Begin typing your search above and press return to search.

తమ్ముడు.. నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిస్కీ బడ్జెట్!

ఈ చిత్రానికి వకీల్ సాబ్ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా బడ్జెట్ విషయంలో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓపెన్ అయ్యారు.

By:  Tupaki Desk   |   24 Jun 2025 3:22 PM IST
తమ్ముడు.. నితిన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిస్కీ బడ్జెట్!
X

నితిన్ ఇటీవల వరుస ఫ్లాపులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు అతని బాక్సాఫీస్ మార్కెట్‌ను గట్టిగానే దెబ్బ కొట్టాయి. ముఖ్యంగా ‘రాబిన్ హుడ్’ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీగా నిర్మించగా అది కూడా నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో నితిన్ ఇప్పుడొక మాస్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఆ సినిమానే ‘తమ్ముడు’.

ఈ చిత్రానికి వకీల్ సాబ్ ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమా బడ్జెట్ విషయంలో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓపెన్ అయ్యారు. ప్రమోషన్ కార్యక్రమాల్లో మాట్లాడుతూ దిల్ రాజు.. “ఈ సినిమాకి 75 కోట్ల ఖర్చు అయ్యింది. కథ మూడేళ్ల క్రితమే ఫిక్స్ చేశాం. కానీ షూటింగ్ విభిన్న కారణాలతో ఆలస్యం అయింది” అని వెల్లడించారు. ముఖ్యంగా ఈ సినిమా కోసం 150 రోజులకు పైగా వర్కింగ్ డేస్ పైనే ఖర్చు చేశారని చెప్పడం గమనార్హం.

నితిన్ గత ట్రాక్‌తో పోలిస్తే ఈ బడ్జెట్ నిజంగా భారీ రిస్క్ అనిపిస్తుంది. సాధారణంగా నితిన్ సినిమాలు 25 నుంచి 30 కోట్ల మధ్యలోనే ప్లాన్ చేస్తారు. ఇక అతని కెరీర్ బెస్ట్ హిట్స్ లో 'అ ఆ' సినిమా 70 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టగా, 'భీష్మ' 50 కోట్ల వరకు వసూలు చేసింది. అయితే ‘రాబిన్ హుడ్’ సినిమాకు పెట్టిన 60 కోట్ల బడ్జెట్ దారుణంగా మైనస్ అయింది. ఇప్పుడు దిల్ రాజు వేసిన 75 కోట్ల రిస్క్ నిజంగా నితిన్ కెరీర్ లోనే అతిపెద్ద బడ్జెట్ రిస్క్ అని చెప్పవచ్చు.

అయితే ట్రైలర్‌కి కొంత పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమాపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. దిల్ రాజు మాటల ప్రకారం ఈ సినిమా సెంటిమెంట్స్, ఎమోషన్స్ యాక్షన్ మిక్స్‌తో ప్రేక్షకుల మనసు గెలుస్తుందట. ఆయన ఈ సినిమాపై ఎంతో నమ్మకంగా ఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పటి వరకూ డిజిటల్ హక్కులు నెట్‌ఫ్లిక్స్‌కు డీసెంట్ ధరకు అమ్ముడుపోయాయి.

ఇతర నాన్ థియేట్రికల్ హక్కులు కూడా క్లోజ్ అయ్యాయని సమాచారం. జులై 4న ‘తమ్ముడు’ థియేటర్లలో విడుదల కానుంది. ఇది నితిన్ కెరీర్‌ను మళ్లీ ట్రాక్‌లోకి తీసుకురావలసిన సినిమా. దిల్ రాజు గ్యాంబ్లింగ్ వర్కౌట్ అవుతుందా లేదా అన్నదే ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎంతైనా, ఈ సినిమా రిజల్ట్‌ మీదే నితిన్ భవిష్యత్తు కూడా ఆధారపడేలా కనిపిస్తోంది.