నిఖిల్ ఇంకా ఎన్నాళ్లు..?
స్వయంభు సినిమా భరత్ కృష్ణమాచార్య డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా హిస్టారికల్ ఫిక్షనల్ మూవీగా రాబోతుంది.
By: Ramesh Boddu | 13 Aug 2025 6:00 PM ISTకార్తికేయ 2 తో సూపర్ హిట్ అందుకున్నాడు నిఖిల్ సిద్ధార్థ. పాన్ ఇండియా లెవెల్ లో ఆ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత 18 పేజెస్ జస్ట్ ఓకే అనిపించగా నెక్స్ట్ స్పై, అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమా ఎలా వచ్చిందో అలానే పోయింది. ఐతే నిఖిల్ నుంచి రెండు భారీ ప్రాజెక్ట్ లు వస్తున్నాయి. అవి దాదాపు సెట్స్ మీదకు వెళ్లి చాలా కాలమైంది. అందులో ఒకటి స్వయంభు కాగా.. మరొకటి ది ఇండియా హౌజ్. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
సెట్స్ మీదకు వెళ్లి రెండేళ్లు..
స్వయంభు సినిమా భరత్ కృష్ణమాచార్య డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా హిస్టారికల్ ఫిక్షనల్ మూవీగా రాబోతుంది. సినిమాలో నిఖిల్ పోరాట సన్నివేశాలు చేయనున్నాడు. ఈ మూవీలో సంయుక్త మీనన్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఐతే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లి దాదాపు రెండేళ్లు కావొస్తుంది. కానీ ఇప్పటివరకు సినిమా అప్డేట్ రాలేదు. అప్పుడెప్పుడో నిఖిల్ ఫస్ట్ లుక్ వదిలారు. సినిమా షూటింగ్ ఎక్కడిదాకా వచ్చింది అన్నది అప్డేట్ లేదు. కనీసం ఆడియన్స్ ని సినిమా మీద ఎంగేజ్ చేసే ప్రయత్నం కూడా చేయట్లేదు. ఏది ఉన్నా రిలీజ్ టైం లో చూద్దామని మేకర్స్ ప్లాన్ కావొచ్చు.
ఇక మరోపక్క ది ఇండియా హౌజ్ సినిమాను రామ్ వంశీ కృష్ణ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు మరో స్పెషల్ ఎట్రాక్షన్ గ్లోబల్ స్టార్ రాం చరణ్. చరణ్, విక్కీ భాగస్వామ్యంలో ఈ మూవీ నిర్మాణం జరుగుతుంది. ఐతే రెండు సినిమాలు చాలా పెద్ద ప్రాజెక్ట్ లే అనిపిస్తుంది. మరి నిఖిల్ ఈ సినిమాల విషయంలో ఏం ఆలోచిస్తున్నాడు అన్నది మాత్రం అర్ధం కావట్లేదు.
స్వయంభు, ది ఇండియా హౌజ్..
ఎందుకంటే ఈమధ్య సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే కాదు మొదలు పెట్టిన టైం లోనే ప్రమోషన్స్ షురూ చేస్తున్నారు. అలా చేస్తేనే సినిమాపై ఆడియన్స్ లో బజ్ పెరుగుతుంది. మరి నిఖిల్ స్వయంభు, ది ఇండియా హౌజ్ ఈ రెండిటిలో ఏది ముందు రిలీజ్ చేస్తారు. ఏ సినిమా షూటింగ్ ఎక్కడివరకు వచ్చిందో తెలియాల్సి ఉంది.
మరీ లేట్ చేస్తే ఈ సినిమాలు ఉన్నాయన్న విషయం ఆడియన్స్ మర్చిపోయే ఛాన్స్ ఉంది. నిఖిల్ కాస్త స్పీడ్ పెంచి ప్రమోషన్స్ మొదలు పెడితే సినిమాల మీద కాస్త బజ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది.