మహేష్, అల్లు అర్జున్ ని టార్గెట్ చేసిన మెగా డాటర్..!
నిహారిక బ్యానర్ లో సంగీత్ శోభన్ హీరోగా ఒక సినిమా రాబోతుంది. ఆ సినిమాను మహిళా దర్శకురాలు మానస శర్మ డైరెక్ట్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 16 May 2025 11:30 PM ISTమెగా డాటర్ నిహారిక తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ముందు యూట్యూబ్ సీరీస్ లో నటిగా మెప్పించి ఆ తర్వాత సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక కథానాయికగా క్లిక్ అవ్వలేకపోయింది. ఆ తర్వాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన నిహారిక ఈసారి నటిగా కాకుండా నిర్మాతగా తన టాలెంట్ చూపిస్తుంది. ఆమె నిర్మించిన తొలి సినిమా కమిటీ కుర్రాళ్లు సూపర్ హిట్ అయ్యింది. నిర్మాతగా తన అభిరుచిని చూపించిన నిహారిక ఇదే క్రమంలో రెండో సినిమాను అనౌన్స్ చేసింది.
నిహారిక బ్యానర్ లో సంగీత్ శోభన్ హీరోగా ఒక సినిమా రాబోతుంది. ఆ సినిమాను మహిళా దర్శకురాలు మానస శర్మ డైరెక్ట్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా నిహారిక కమిటీ కుర్రాళ్లు సినిమాకు గాను వర్సటైల్ ప్రొడ్యూసర్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ అందుకున్నారు. ఆ ఈవెంట్ లో నిహారిక స్పీచ్ ఆడియన్స్ ని మెప్పించింది. ఇక ఈ ఈవెంట్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూలో నిహారిక తన ప్రొడక్షన్ లో మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి వాళ్లతో సినిమాలు చేయాలని ఉందన్న విషయాన్ని వెల్లడించారు.
అల్లు అర్జున్ తో లవ్ స్టోరీని.. మహేష్ తో మైథలాజికల్ మూవీ చేస్తానన్న నిహారిక ప్రభాస్ తో ఒక ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమా చేస్తానని అన్నది. ఇక డైరెక్షన్ చేస్తే మాత్రం మొదటి సినిమా రామ్ చరణ్ తో చేస్తానంటుంది అమ్మడు. అంతేకాదు తనకు తానుగా సలహాలు ఇచ్చుకోవాలంటే ఏం చేస్తారన్న ప్రశ్నకు సమాధానంగా ఎక్కువ మేకప్ వేసుకోవద్దని తనలో ఉన్న యాంకర్ కి.. నిన్ను నువ్వు నమ్ముకో అని తనలో ఉన్న నిర్మాతకు, మంచి స్క్రిప్ట్ లు సెలెక్ట్ చేసుకోమని తనలోని నటికి సలహా ఇచ్చుకుంటా అన్నారు నిహారిక.
హీరోయిన్ గా పలు ప్రయత్నాలు చేసిన నిహారిక మొదటిసారి ఫెయిల్ అయ్యింది. ఐతే ఈమధ్య మళ్లీ కోలీవుడ్ లో మళ్లీ యాక్టర్ గా ప్రయత్నాలు చేస్తుంది నిహారిక. అక్కడ క్లిక్ అయితే చిన్నగా మళ్లీ తెలుగులో హీరోయిన్ గా సినిమాలు చేయాలని అనుకుంటుంది నిహారిక. మొత్తానికి మెగా డాటర్ గా నిహారిక తన సొంత టాలెంట్ తో నటిగా, నిర్మాతగా, హోస్ట్ గా అందరినీ అలరిస్తున్నారు. సో నిహారిక దృష్టిలో ఏ స్టార్ తో ఎలాంటి సినిమా చేయాలన్న ఐడియా ఐతే ఉంది ఐతే ఆమె కోరినట్టుగా మిగతా స్టార్స్ దొరకరేమో కానీ కాస్త ట్రై చేస్తే మెగా హీరోలు కచ్చితంగా దొరికే ఛాన్స్ ఉంటుంది. మరి మెగా డాటర్ నిహారిక నిర్మాతగా తన ప్రయాణం ఎలా కొనసాగిస్తుంది అన్నది చూడాలి.