దగ్గరైన వాళ్లు నానికిప్పుడు దూరమవుతున్నారా?
నేచురల్ స్టార్ నాని ఇమేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అన్ని వర్గాల అభిమానుల్ని సంపాదించుకున్న ఏకైక స్టార్.
By: Srikanth Kontham | 14 Aug 2025 1:00 AM ISTనేచురల్ స్టార్ నాని ఇమేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అన్ని వర్గాల అభిమానుల్ని సంపాదించుకున్న ఏకైక స్టార్. సహజ నటనతోనే నాని అన్ని వర్గాలకు దగ్గరయ్యాడు. స్టూడెంట్స్, ఫ్యామిలీ ఆడియన్స్, యూత్, వయస్కులు ఇలా అన్ని వర్గాల అభిమానులు నాని సినిమాలను ఎంతో ఇష్టడి వీక్షిస్తుంటారు. హీరోల్లో నాని అరుదైన రకం కావడంతోనే ఇలాంటి ఆదరణ సాధ్యమైంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అంత వేగంగా ఎదిగాడు? అంటే ప్రధాన కారణం ఈ రకమైన ఆదరణ దక్కడంతోనే అన్నది కాదలేని వాస్తవం.
నానికి వాళ్లు దూరంగా:
`అష్టా చెమ్మా` నుంచి `అంటే సుందరం` వరకూ నాని సినిమాలన్నింటిని అన్ని వర్గాల ప్రేక్షకులు ఆదరించారు. అయితే ఈ మధ్య కాలంలో నాని కుటుంబ ప్రేక్షకులకు దూరమవుతున్నాడు? అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. తాను ఎంచుకుంటోన్న కంటెంట్ తోనే ఈ దూరం పెరిగిందనే విమర్శ నానిపై వినిపిస్తోంది. `దసరా`లో నాని మాస్ రోల్ అందరికీ కనెక్ట్ అవ్వలేదు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కి నాని రోల్ కనెక్ట్ అవ్వలేదు. యాక్షన్ చిత్రాలు ఇష్టపడే వారికే ఆ సినిమా..అందులో నాని పాత్ర కనెక్ట్ అయింది.
ఆ మూడింటిని మించి:
ఇటీవలే రిలీజ్ అయిన `హిట్ ది థర్డ్ కేస్` తో ఆ విమర్శ పతాక స్థాయికి చేరింది. సైకో థ్రిల్లర్ పాత్రలకు ఫ్యామిలీ ఆడియన్స్, పిల్లలు కనెక్ట్ కాలేదనే వాదన తెరపైకి వస్తోంది. సినిమాలో మిగతా పాత్రలకు ధీటుగా నాని పాత్రను కూడా అంతే సీరియల్ కిల్లర్గా చూపించడం అన్నది అందరు జీర్ణించుకోలేకపోతున్నారు. అప్పటి వరకూ క్లాసిక్ రోల్స్ లో చూసిన నానిని అలా ఓన్ చేసుకోవాలంటే? కష్టంగా మారిందన్నది కనెక్ట్ కాని వారి వెర్షన్. తాజాగా నాని చేస్తోన్న మరో చిత్రం `ప్యారడైజ్` కూడా ఆ మూడు చిత్రాలను మించి ఉంటుంది.
నెట్టింట అదే చర్చ:
ఇటీవలే రిలీజ్ అయిన గ్లింప్స్ తో నాని పాత్రలో మాస్ గాఢతను తెలియజేస్తోంది. `దసరా`, `హిట్` సినిమా లను మించి నాని లో మాస్ కోణం హైలైట్ అవుతుందని అంచనాలున్నాయి. నానిలో ఈ రకమైన మార్పు మార్కెట్ పరంగా...స్టార్ డమ్ పరంగా మెరుగైందే. కానీ నానిలో మాస్ ఎలివేషన్ అన్నది ఓ సెక్షన్ కి దూరం చేస్తోందన్నది అంతే వాస్తవంగా నెట్టింట చర్చ జరుగుతోంది.