Begin typing your search above and press return to search.

హిట్ 3 బాక్సాఫీస్ దూకుడు.. ప్రీ రిలీజ్ బుకింగ్స్‌లో న్యూ రికార్డు!

ఈ సీజన్‌లో తెలుగు బాక్సాఫీస్ దగ్గర సాలీడ్ హీట్ పడాల్సిన అవసరం ఉంది. సమ్మర్ సీజన్ లో.ఇప్పటివరకు సరైన సినిమా పడలేదు.

By:  Tupaki Desk   |   29 April 2025 9:51 PM IST
Nani HIT 3 Dominates Summer Box Office
X

ఈ సీజన్‌లో తెలుగు బాక్సాఫీస్ దగ్గర సాలీడ్ హీట్ పడాల్సిన అవసరం ఉంది. సమ్మర్ సీజన్ లో.ఇప్పటివరకు సరైన సినిమా పడలేదు. అయితే ఇండస్ట్రీకి హిట్ తీసుకురావాల్సిన బాధ్యత ఇప్పుడు నాని నటించిన హిట్ 3 పైనే ఉంది. మొదటి రెండు భాగాల సక్సెస్ తర్వాత వస్తున్న ఈ సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో మంచి హైప్ ఉంది. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా మే 1న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. రిలీజ్‌కు రెండు రోజుల ముందు నుంచే ఈ సినిమాకు బుకింగ్స్ ఊహించని స్థాయిలో దూసుకుపోయాయి.

ప్రస్తుతం రిలీజ్ కు రెండు రోజుల ముందు బుక్ మై షో ప్రీ సేల్స్ డేటా చూస్తే, నాని సినిమా హవా స్పష్టంగా కనిపిస్తోంది. హిట్ 3 ఇప్పటికే 88 వేల టికెట్లు విక్రయించేసుకుంది. ఇది రీసెంట్ టైమ్స్‌లో మిడ్ రేంజ్ సినిమాల మధ్య అత్యధిక అడ్వాన్స్ బుకింగ్స్ గా రికార్డు సృష్టించింది. థియేటర్ మల్టిప్లెక్స్ లెవెల్ నుంచీ మాస్ సెంటర్స్ వరకూ అన్ని చోట్ల కూడా టిక్కెట్లు వేగంగా సేల్ అవుతున్నాయి. నాని మళ్లీ తన మార్క్ చూపించడానికి రెడీగా ఉన్నాడు.

ఇదే సమయంలో ఇతర సినిమాల పరిస్థితి కూడా చూడదగ్గ విధంగా ఉంది. గత జనవరిలో విడుదలైన హనుమాన్ 52 వేల టికెట్లను ముందుగా విక్రయించి మంచి హిట్ సాధించింది. అలాగే నాని తన గత సినిమా సరిపోదా శనివారం కూడా విడుదలకు ముందు 48 వేల టికెట్లు అమ్మేసుకున్నది. ఇది నానికి వరుస హిట్ల స్పీడ్ ఇస్తోంది. మరి హిట్ 3 వాటి కంటే మిన్నగా రికార్డ్ క్రియేట్ చేయడం నాని బాక్సాఫీస్ స్టామినా ఎలా పెరిగిందో చెబుతోంది.

అలాగే ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం 23 వేల టికెట్లు మాత్రమే ప్రీ సేల్స్‌లో రిజిస్టర్ చేయగలిగింది. మాస్ మసాలా ఎంటర్‌టైనర్ అయినా, అంచనాలకు తగ్గట్టు మొదటి రెండు రోజుల్లో పెద్దగా ఆకర్షించలేకపోయింది. అలాగే రవితేజ నటించిన ఈగల్ 11 వేల టికెట్లు, మిస్టర్ బచ్చన్ 9 వేల టికెట్లు మాత్రమే బుకింగ్ చేసుకున్నాయి. అలాగే లక్కీ భాస్కర్, టిల్లు స్క్వేర్ రెండూ 6 వేల టికెట్ల పరిధిలోనే నిలిచిపోయాయి.

విడుదలకు రెండురోజుల ముందే బుక్ మై షోలో టాలీవుడ్ సినిమా ప్రీ సేల్స్ రికార్డులు ఇలా ఉన్నాయి:

హిట్ 3: 88,000 టికెట్లు

హనుమాన్: 52,000 టికెట్లు

సరిపోదా శనివారం: 48,000 టికెట్లు

సంక్రాంతికి వస్తున్నాం: 23,000 టికెట్లు

ఈగల్: 11,000 టికెట్లు

మిస్టర్ బచ్చన్: 9,000 టికెట్లు

సైంధవ్: 7,000 టికెట్లు

లక్కీ భాస్కర్: 6,000 టికెట్లు

టిల్లు స్క్వేర్: 6,000 టికెట్లు