Begin typing your search above and press return to search.

హిట్-3 కోసం అనిరుధ్.. నాని రోల్ కు పెర్ఫెక్ట్ సెట్!

అయితే హిట్ 3 థర్డ్ సింగిల్ స్పెషల్ ఏంటంటే.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తన గాత్రాన్ని అందించారు.

By:  Tupaki Desk   |   26 April 2025 11:19 AM IST
Anirudh For HIT3
X

టాలీవుడ్ స్టార్ హీరో నాని.. ఇప్పుడు హిట్-3 మూవీతో సందడి చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. హిట్ యూనివర్స్ లో మూడో సినిమాగా వస్తున్న ఆ చిత్రం.. మే1వ తేదీన రిలీజ్ కానుంది. సినిమాలో వయొలెన్స్ ఫుల్ గా ఉంటుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది. అదే సమయంలో మూవీపై ఆడియన్స్ లో ఓ రేంజ్ లో అంచనాలున్నాయి.

అందుకు తగ్గట్లే మేకర్స్ కూడా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. వరుస అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు. మూవీ టీమ్ అంతా ఇంటర్వూలు ఇస్తూ బజ్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా వెయిట్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా మేకర్స్.. మూవీ నుంచి థర్డ్ సింగల్ 'తను' ను విడుదల చేశారు.

అయితే హిట్ 3 థర్డ్ సింగిల్ స్పెషల్ ఏంటంటే.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ తన గాత్రాన్ని అందించారు. మిక్కీ జే మేయర్ బాణీలు కట్టగా, రాఘవ లిరిక్స్ రాశారు. అనిరుధ్.. సర్ప్రైజింగ్ గా తన గొంతుతో ప్రాణం పోశారు. కాగా, తను సాంగ్.. ఒక సిట్యువేషనల్ సాంగ్ అని క్లియర్ గా తెలుస్తోంది.

డిఫరెంట్ ఫీల్ కలిగించే మ్యూజిక్ తో పాట బాగుందని నెటిజన్లు చెబుతున్నారు. అదే సమయంలో సాంగ్ సిట్యువేషన్ కు తగ్గట్టు అనిరుధ్ గాత్రం ఉందని పాడుతున్నారు. చాలా బాగా పాడారని కొనియాడుతున్నారు. పాట మొత్తం శైలేష్ స్టైల్ లో చాలా భిన్నంగా సాగిందని, షూట్ చేసిన తీరు నచ్చిందని చెబుతున్నారు.

అయితే పాట అంతా ఒక సెట్ లో.. ఒక్క టేక్ లో మొత్తం తీశారని కామెంట్లు పెడుతున్నారు. సాంగ్ లో నాని.. ముందు పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఉంటారు. ఆ తర్వాత పాట పాడుతూనే రౌడీల పని పడతారు. అలా పోలీసులతో డ్యాన్స్ కూడా చేస్తారు. సాంగ్ చివర్లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి కనిపిస్తుంది. మొత్తానికి అనిరుధ్ పాడిన పాట ఇప్పుడు అందరినీ మెప్పిస్తూ దూసుకుపోతోంది.

కాగా, ఇప్పటికే నానితో అనిరుధ్ రవిచందర్ పలుమార్లు వర్క్ చేసిన విషయం తెలిసిందే. జెర్సీ, గ్యాంగ్ లీడర్ చిత్రాలకు అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశారు. ఇప్పుడు ప్యారడైజ్ మూవీకి ఆయనే బాణీలు కడుతున్నారు. అలా ఆ బాండింగ్ తోనే నాని కోసం హిట్-3లో 'తను' పాట పాడినట్లు తెలుస్తోంది.