చాలా వారాల తర్వాత 'హిట్ 3'తో అక్కడ జోష్..!
ఇలాంటి సమయంలో హిట్ 3 సినిమా విడుదలకు ముందే యూఎస్ బాక్సాఫీస్ వద్ద ప్రీ సేల్ ద్వారా మిలియన్ డాలర్లను వసూళ్లు చేసే పరిస్థితి కనిపిస్తోంది.
By: Tupaki Desk | 27 April 2025 7:10 AMనాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన 'హిట్ 3' సినిమా విడుదలకు ముస్తాబు అయ్యింది. మే 1న విడుదల కాబోతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ మొదలు అయింది. యూఎస్‌లో ఈ సినిమా విడుదలకు వారం రోజులు ఉండగానే $200K ప్రీ సేల్ నమోదు చేసింది. విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్న నేపథ్యంలో కచ్చితంగా రిలీజ్‌కి ముందే మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో నమ్మకం వ్యక్తం అవుతోంది. నాని సినిమాలకు యూఎస్‌లో మంచి ఆధరణ గతంలోనూ లభించింది. సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంతో పాటు, నాని చాలా నమ్మకంగా సినిమాను ప్రమోట్ చేస్తున్న విషయం తెల్సిందే.
ఈ కారణాల వల్ల సినిమాకు మంచి వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో విడుదలైన ఏ సినిమాలకు యూఎస్‌లో మిలియన్ డాలర్ల వసూళ్లు నమోదు కాలేదు. సంక్రాంతి సినిమాల తర్వాత వచ్చిన సినిమాలు ఏవీ కూడా ఆశించిన స్థాయిలో ఆడిన సందర్భాలు లేవు. ఇక్కడ పర్వాలేదు అనిపించినా ఓవర్సీస్‌లో తెలుగు సినిమాలు పెద్దగా ఆడలేదు. ఒకప్పుడు నెలకు కనీసం ఒకటి అయినా యూఎస్‌లో మిలియన్ డాలర్లు సాధించిన సినిమా వచ్చేది. కానీ గత కొన్ని వారాల్లో యూఎస్‌లో మిలియన్ డాలర్లను వసూళ్లు సాధించిన సినిమా రాలేదు. ఇలాంటి సమయంలో హిట్ 3 సినిమా విడుదలకు ముందే యూఎస్ బాక్సాఫీస్ వద్ద ప్రీ సేల్ ద్వారా మిలియన్ డాలర్లను వసూళ్లు చేసే పరిస్థితి కనిపిస్తోంది.
హిట్ ప్రాంచైజీలో వచ్చిన సినిమాలు ఇప్పటికే మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. విశ్వక్ సేన్, అడవి శేష్‌లు నటించిన ఆ సినిమాలకు మంచి స్పందన రావడంతో ఇప్పుడు నాని తో శైలేష్ కొలను హిట్ ప్రాంచైజీ మూవీ రూపొందించిన నేపథ్యంలో అంచనాలు భారీగా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా హిట్ 3 సినిమాను దర్శకుడు రూపొందించాడు. ఆకట్టుకునే కథ, కథనంతో మొదటి రెండు పార్ట్‌లతో పోల్చితే హిట్ 3 లో మరో రేంజ్ క్రైమ్ ను చూపించబోతున్నట్లు ట్రైలర్‌ను చూస్తే అనిపిస్తోంది. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మరింత స్పీడ్‌గా చస్తున్నారు. భారీ ఎత్తున అంచనాలున్న హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి రాజమౌళి హాజరు కానున్న నేపథ్యంలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది. 'ఎ' సర్టిఫికెట్ వచ్చినప్పటికీ కచ్చితంగా ఈ సినిమా తప్పకుండా మంచి వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. హిట్ 3 సినిమాను నాని తన సొంత బ్యానర్‌లో నిర్మించాడు. నాని ఈమధ్య కాలంలో చేసిన సినిమాలతో పోల్చితే హిట్ 3 కి అత్యధిక బడ్జెట్‌ను ఖర్చు చేశారని తెలుస్తోంది. యూఎస్ ప్రీమియర్స్‌కి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అత్యధిక స్క్రీన్స్‌లో సినిమాను విడుదల చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. కాస్త పోటీ ఉన్నప్పటికీ పాన్ ఇండియా రేంజ్‌లోనూ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.