జక్కన్నతో హిట్ మ్యాన్ నాని సెలబ్రేషన్
వేదికపై జక్కన్నతో నేచురల్ స్టార్ నాని ర్యాపోకి సందడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.
By: Tupaki Desk | 28 April 2025 9:52 AM ISTనేచురల్‌స్టార్ నాని నటించిన `హిట్ 3` మే 1న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. శైలేష్ కొలను ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కథానాయికగా నటించింది. తాజాగా ప్రీరిలీజ్ వేడుకలో దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి సందడి చేసారు. వేదికపై జక్కన్నతో నేచురల్ స్టార్ నాని ర్యాపోకి సందడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.
హిట్ ఫ్రాంఛైజీలో మూడో సినిమా ఇండియా, అమెరికా సహా పలు చోట్ల ఈ చిత్రం భారీగా విడుదలవుతోంది. దీంతో నానీ ఓవర్సీస్ లోను తన రికార్డులు తానే బ్రేక్ చేస్తాడని భావిస్తున్నారు. హిట్ 3 నాని కెరీర్ బెస్ట్ ఓపెనింగులు సాధిస్తుందని అంచనా. తాజా ఈవెంట్లో జక్కన్న ప్రమోషన్ ఈ సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ కి అదనపు బూస్ట్ ఇస్తుందనడంలో సందేహం లేదు.
ఇక నానీతో జక్కన్న ఎంత జోవియల్ గా ఉంటారో `హిట్ 3` ప్రచార వేదిక మరోసారి ప్రూవ్ చేసింది. రాజమౌళి వేదికపైకి చేరుకోగానే అతడి చేతికి ఒక ఆయుధాన్ని అందించిన టీమ్ అతడితో ఒక చెక్క పెట్టెను కూడా పగులగొట్టించింది. ఇందులో రెండు వైట్ సూట్లు ఉన్నాయి. వాటిలో ఒకటి రాజమౌళి ధరించగా, మరొకటి నాని ధరించారు. మరో వీడియోలో రాజమౌళి- నాని జోడీ భారీ రోప్ చైన్ ను బ్రేక్ చేస్తూ కనిపించారు. ప్రస్తుతం హిట్ 3 యూనిక్ ప్రమోషన్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.
హిట్ 3 లో భయంకరమైన హత్యలను పరిశోధించే ఆఫీసర్ గా నేచురల్ స్టార్ నాని కనిపించనున్నారు. క్రూరమైన పోకిరి వైఖరి ఉన్న ఐపిఎస్ అధికారిగా నాని ఈ చిత్రంలో నటించారు. జమ్మూ అండ్ కాశ్మీర్ నుండి విశాఖపట్నంకు బదిలీ అయిన ఐపీఎస్ అధికారి ఆపరేషన్ ఏమిటన్నది తెరపైనే చూడాలి.