Begin typing your search above and press return to search.

నాని మూవీ రిజ‌ల్ట్ కోసం నాగ్ వెయిటింగ్

నా సామిరంగ సినిమా వ‌చ్చి సంవ‌త్స‌రంన్న‌ర అవుతున్న‌ప్ప‌టికీ నాగ్ మ‌రో సినిమాను ఒప్పుకుంది లేదు. అలా అని నాగ్ ఖాళీగా ఏమీ లేడు.

By:  Tupaki Desk   |   29 April 2025 9:02 PM IST
Nagarjuna Sailesh Kolanu Movie Project
X

గ‌త కొంత‌కాలంగా అక్కినేని హీరోలు స‌రైన స‌క్సెస్ లేక ఇబ్బంది ప‌డుతున్నారు. నాగార్జున నుంచి నాగ‌చైత‌న్య‌, అఖిల్ అంద‌రిదీ ఇదే ప‌రిస్థితి. నాగ చైత‌న్య ఆ ప‌రిస్థితుల‌ను దాటుకుని రీసెంట్ గానే తండేల్ సినిమాతో హిట్ అందుకున్నాడు. అఖిల్ ప‌రిస్థితి చెప్పే ప‌న్లేదు. ఇక నాగార్జున‌ నా సామిరంగ సినిమాపై ఎన్నో ఆశ‌లు పెట్టుకుని చేస్తే ఆ సినిమా బాగానే ఆడింది కానీ అత‌ను అనుకున్న స్థాయి రెస్పాన్స్ మాత్రం తెచ్చుకోలేక‌పోయింది.

నా సామిరంగ సినిమా వ‌చ్చి సంవ‌త్స‌రంన్న‌ర అవుతున్న‌ప్ప‌టికీ నాగ్ మ‌రో సినిమాను ఒప్పుకుంది లేదు. అలా అని నాగ్ ఖాళీగా ఏమీ లేడు. కోలీవుడ్ హీరో ధ‌నుష్ తెలుగులో శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్న కుబేర సినిమాలో నాగార్జున ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే అది మ‌ల్టీస్టార‌ర్ గా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాలో నాగార్జున పాత్ర చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటుందంటున్నారు.

దీంతో పాటూ త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ హీరోగా లోకేష్ క‌న‌గ‌రాజ్ తెర‌కెక్కిస్తున్న కూలీ సినిమాలో కూడా నాగ్ ఓ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. ఈ సినిమాపై కూడా అంద‌రికీ మంచి అంచ‌నాలున్నాయి. ఈ రెండు క్రేజీ సినిమాలూ ఈ ఏడాదే ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాయి. అయిన‌ప్ప‌టికీ నాగ్ సోలో హీరోగా ఓ సినిమా చేసి, సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాల‌ని ఆయ‌న ఫ్యాన్స్ కోరుతున్నారు.

నాగ్ కూడా దీనిపైనే వ‌ర్క్ చేస్తున్నాడు. సోలో గా సినిమా చేయ‌డం కోసం నాగార్జున ప్ర‌స్తుతం క‌థ‌ల‌ను వినే ప‌నిలో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గానే హిట్ ఫ్రాంచైజ్ డైరెక్ట‌ర్ శైలేష్ కొల‌ను నాగార్జునకు ఓ స్టైలిష్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ను నెరేట్ చేశాడ‌ట‌. నాగ్ కు కూడా ఆ స్టోరీ లైన్ న‌చ్చ‌డంతో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేసి నెరేష‌న్ ఇవ్వ‌మ‌ని చెప్పాడ‌ట‌.

దీంతో నాగ్ ఇప్పుడు శైలేష్ చేసిన తాజా సినిమా హిట్3 రిజ‌ల్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడ‌ట. హిట్3 ఆడియ‌న్స్ ను ఆక‌ట్టుకోవ‌డంలో స‌క్సెస్ అయితే శైలేష్, త‌న సినిమాను ఇంకా బాగా ప్రెజెంట్ చేయ‌గ‌ల‌డనే న‌మ్మ‌కం నాగ్ కు క‌లుగుతుంది. అందుకే నాని సినిమా రిజ‌ల్ట్ కోసం నాగ్ వెయిట్ చేస్తున్నాడ‌ట‌. నాని హీరోగా తెర‌కెక్కిన హిట్3 మే 1న రిలీజ్ అవుతోంది. భారీ అంచ‌నాల‌తో రిలీజ‌వుతున్న ఈ సినిమా ఫ‌లితంపై శైలేష్, నాగ్ మూవీ డిపెండ్ అయి ఉంది.