NC24 సర్ ప్రైజ్.. మరోసారి సత్తా చూపించేందుకు సిద్ధమైన నాగచైతన్య
యువసామ్రాట్ నాగచైతన్య ఈమధ్య కాలంలో సెట్ చేసుకుంటున్న ప్రాజెక్టులు ఎంతో భిన్నంగా ఉన్నాయి.
By: Tupaki Desk | 26 April 2025 5:34 PM ISTయువసామ్రాట్ నాగచైతన్య ఈమధ్య కాలంలో సెట్ చేసుకుంటున్న ప్రాజెక్టులు ఎంతో భిన్నంగా ఉన్నాయి. ఇక తన సినిమాల ద్వారా తెలుగు సినీ స్థాయిని పెంచాలని కొన్ని నెలల క్రితం మాట ఇచ్చారు. తండేల్ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత, ప్రతి సినిమా ప్రత్యేకంగా ఉండాలని.. థియేటర్స్‌లో ప్రేక్షకుల డబ్బు, టైమ్ వృథా కాకూడదని హామీ ఇచ్చారు. ఇప్పుడు తన కొత్త సినిమా NC24తో ఆ హామీని నిలబెట్టుకునేందుకు 100 శాతం కృషి చేస్తున్నారు.
విరూపాక్ష దర్శకుడు కార్తీక్ దండు డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న NC24 సినిమాకు సంబంధించి The Excavation Begins వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో చూస్తే నిజంగానే హాలీవుడ్ స్థాయిలో ప్రీ-ప్రొడక్షన్ చేసినట్టు స్పష్టమవుతోంది. భారీగా ప్లానింగ్, రిహార్సల్స్, మినియేచర్ మోడల్స్ సిద్ధం చేయడం వంటి పనులు విదేశీ ప్రమాణాలకు సరిపోయేలా జరిగాయి.
ఇప్పటి వరకు హాలీవుడ్ మూవీస్ లో మాత్రమే ఇలాంటి బిహైండ్ ది సీన్స్ వర్క్ చూశాం. ఇప్పుడు మన తెలుగు సినిమా కూడా అదే స్థాయిలో పనిచేస్తోంది అంటే, ఇండియన్ సినిమా గ్లోబల్ మార్కెట్ కోసం ఎంతగా మారిందో స్పష్టమవుతోంది. నాగచైతన్య లుక్, అతని ట్రాన్స్‌ఫార్మేషన్ ఈ ప్రాజెక్ట్ పట్ల ఉన్న డెడికేషన్ ను చూపిస్తున్నాయి.
డైరెక్టర్, టెక్నికల్ క్రూ తో కలిసి నాగచైతన్య ప్రతీ చిన్న అంశాన్ని కూడా పర్ఫెక్ట్‌గా చేయాలని ఎంత కష్టపడుతున్నారో వీడియోలో కనబడుతోంది. ప్రస్తుతం భారతీయ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న తరుణంలో, ఇలాంటి క్వాలిటీ ఫిల్మ్స్ మన స్థాయిని మరింత పెంచుతాయి.
ఈ గ్రాండ్ ప్రాజెక్టును బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై సినిమా ప్రెజెంట్ అవుతోంది. విడుదల చేసిన వీడియో NC24 కథ పట్ల, విజువల్స్ పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే, నాగచైతన్య తన నెక్ట్స్ మూవీని తెలుగు సినీ పరిశ్రమ గర్వించేలా తీర్చిదిద్దుతున్నారు. ఇక సినిమా విడుదలయ్యే వరకూ ఈ క్రేజ్ ఇంకా పెరిగే అవకాశం ఉంది.