డెన్ లోకి ఎంట్రీ ఇస్తున్న N.C 24
'తండేల్' హిట్ తో యువ సామ్రాట్ నాగ చైతన్య పుల్ జోష్ లో ఉన్నాడు. రెట్టించిన ఉత్సాహంలో NC 24ని కూడా పట్టాలెక్కించాడు.
By: Tupaki Desk | 16 May 2025 1:34 PM IST'తండేల్' హిట్ తో యువ సామ్రాట్ నాగ చైతన్య పుల్ జోష్ లో ఉన్నాడు. రెట్టించిన ఉత్సాహంలో ఎన్ సీ 24ని కూడా పట్టాలెక్కించాడు. ఈ చిత్రాకి 'విరూపాక్ష' ఫేం కార్తీక్ దండు తెరకెక్కిస్తున్నాడు. మిస్టికల్ థ్రిల్లర్ గా రూపొందుతుంది. థ్రిల్లర్ కాన్సెప్ట్ కావడంతో ఈ సినిమా షూటింగ్ ఎక్కువగా సెట్స్ లోనే చేస్తు న్నారు. ఆరంభ షెడ్యూల్ భారీ సెట్ లోనే ప్రారంభమైంది. అందులో నాగచైతన్య సహా ప్రధాన పాత్ర ధారులపై కీలక సన్నివేశాలు తెరకెక్కించారు.
షూట్ లో మీనాక్షి చౌదరి కూడా జాయిన్ అయింది. 15 రోజుల పాటు సాగిన షెడ్యూల్ లో కీలక ఎపిసోడ్లు చిత్రీకరించారు. తాజాగా మరో షెడ్యూల్ కోసం అన్నపూర్ణ స్టూడి యోస్ సమీపంలో ఓ భారీ గుహసెట్ వేసారు. సెట్ చాలా కొత్తగా ఉందని చూసిన వారు చెబుతున్నారు. సెట్ లోపల అంతా డిఫరెంట్ వరల్డ్ హైలైట్ అవుతుందంటున్నారు. ఈసెట్ లో సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చెబుతున్నారు.
కొత్త షెడ్యూల్ ఇందులోనే ప్రారంభం కానుంది. ఇలాంటి థ్రిల్లర్ చిత్రాల్లో చైతన్య ఇంత వరకూ నటించని సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా షూటింగ్ ఆయనకు కొత్త ఎక్స్ పీరియన్స్ ను అందిస్తుంది. ఈ సిని మా బడ్జెట్ కూడా పెరుగుతున్నట్లు సమాచారం. 'తండేల్' సక్సెస్ అయిన నేపథ్యంలో చైతన్య 100 కోట్ల క్లబ్ లో కి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చైతన్య మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని నిర్మా తలు బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ముందుకొస్తున్నారు.
కార్తీక్ దండు తొలి చిత్రం 'విరూపాక్ష' కూడా మిస్టికల్ థ్రిల్లరే. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల వసూళ్లను సాధించించింది. దీంతో కార్తీక్ మరోసారి అదే తరహా కంటెంట్ ని ఎంచుకున్నాడు. ఈ విషయంలో కార్తీక్ ని సుకుమార్ కూడా అంతే విశ్వషిస్తున్నారు. ఈయన కూడా సుక్కు శిష్యుడు అన్న సంగతి తెలిసిందే. అందుకే శ్రీవెంకటేశ్వరా క్రియేషన్స్ సంస్థతో సుకుమార్ రైటింగ్స్ కూబా భాగస్వామిగా మారింది.