కుంభమేళాలో పూసలమ్మే అమ్మాయేనా?
మోనాలిసా రూపురేఖల్ని మార్చే విధంగా తనను అద్బుతంగా డిజైన్ చేసిన ఫోటోలు వీడియోలను షేర్ చేయగా అవి అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి.
By: Tupaki Desk | 30 April 2025 3:00 AM ISTప్రయాగ్‌రాజ్ కుంభమేళా చాలా మెరుపుల్ని పరిచయం చేసింది. అలాంటి ఒక మెరుపు ఈ పూసలమ్మే అమ్మాయి. ఈ భామ పరిచయం అవసరం లేదు. మోనాలిసా తన పేరు.. పేరుకు తగ్గట్టే సమ్మోహన రూపంతో కట్టి పడేసిన ఈ పూసలమ్మాయికి దేశవ్యాప్తంగా గొప్ప ఫాలోయింగ్ ఏర్పడింది. కుర్రాళ్లు వెంటపడి విసిగించేంతగా తన అందంతో కవ్వించింది మోనాలిసా.
పూసలు, దండలు అమ్మే ఈ అమ్మాయి వెంట బోయ్స్ పిచ్చెక్కి తిరిగారు. పలువురు దర్శకనిర్మాతలు మోనాలిసాకు తమ సినిమాల్లో అవకాశాలు కల్పించేందుకు ముందుకు వచ్చారు. మోనాలిసా యూట్యూబ్ ఇంటర్వ్యూలు సంచలనంగా మారాయి. ఎట్టకేలకు మోనాలిసా తన తొలి సినిమాలో నటిస్తోందని వార్తలు వచ్చాయి. తాజా వీడియోలలో మోనాలిసా రూపు రేఖలు గుర్తు పట్టలేనంతగా మారిపోవడంతో ఇప్పుడు అందరూ ఆశ్చర్యపోతున్నారు. కట్టిపడేసేంతగా మేకోవర్‌తో ఆశ్చర్యపరుస్తోంది. అంతేకాదు ఈ మేకోవర్ తర్వాత మోనాలిసా గుర్తించలేనిదిగా కనిపిస్తోంది.
అయితే ఈ మార్పునకు కారణం.. మేకప్ ఆర్టిస్ట్ మొహ్సినా అన్సారీ. మోనాలిసా రూపురేఖల్ని మార్చే విధంగా తనను అద్బుతంగా డిజైన్ చేసిన ఫోటోలు వీడియోలను షేర్ చేయగా అవి అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి. మోనాలిసా చీరల్లో పూర్తిగా గ్లామరస్‌గా కనిపించింది. ఒక క్లిప్‌లో మోనాలిసా వధువుగా దుస్తులు ధరించి, ఆకుపచ్చ పచ్చలతో అలంకరించుకుని, భారీ ఆభరణాలతో, సాంప్రదాయ ఎరుపు పెళ్లి లెహంగాను ధరించి కనిపించింది.
ఈ రూపం చూడగానే ఆమె ఈమేనా? అని ఆశ్చర్యపోయేంత సర్ ప్రైజ్ ని ఇచ్చింది. మరోసారి మోనాలిసా కొత్త రూపం వెబ్ లో హాట్ టాపిగ్గా మారింది. వైరల్ గర్ల్ మోనాలిసా మోడలింగ్ సహా సినిమాల్లో అవకాశాలు అందుకుని పెద్ద స్థాయికి ఎదిగేస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.