Begin typing your search above and press return to search.

అమలాపురం కిమ్స్ లో మిత్ర మండలి హంగామా..!

ప్రియదర్శి, విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా లీడ్ రోల్స్ లో సోషల్ మీడియా సెన్సేషన్ నిహారిక ఎన్.ఎం నటిస్తున్న సినిమా మిత్ర మండలి.

By:  Tupaki Desk   |   24 Jun 2025 9:17 PM IST
అమలాపురం కిమ్స్ లో మిత్ర మండలి హంగామా..!
X

ప్రస్తుతం సినిమా తీయడం కన్నా ఆ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లడమే ఒక విజయసోపానంగా మారింది. స్టార్ సినిమా ఐనా చిన్న సినిమా అయినా సరే ప్రేక్షకుల్లోకి వెళ్తేనే థియేటర్లకు వచ్చేది, టికెట్లు తెగేది. అందుకే సినిమాను తెరకెక్కించడానికి ఎంత శ్రద్ధ వహిస్తున్నారో అదేవిధంగా సినిమా ప్రమోషన్స్ విషయంలో కూడా అంతే ఫోకస్ చేస్తున్నారు. ఐతే సినిమాను బట్టి ప్రమోషన్స్ అన్నట్టుగా ఒక్కొక్కరు ఒక్కోలా ప్రమోషన్స్ చేస్తారు.

ఏ సినిమా అయినా సక్సెస్ అవ్వాలంటే అది యూత్ ఆడియన్స్ కి నచ్చాలి. ఆ యూత్ ఉండేది కాలేజీల్లోనే. అందుకే ఏ సినిమా ఈవెంట్ అయినా సరే కాలేజీల్లో ప్లాన్ చేస్తుంటారు. అక్కడ సాంగ్స్, టీజర్ రిలీజ్ చేసి యూత్ ని ఎట్రాక్ట్ చేస్తుంటారు. ఇదే క్రమంలో లేటెస్ట్ గా ఒక యూత్ ఫుల్ సినిమాకు సంబంధించిన సినిమా సాంగ్ ని కాలేజీలో స్టూడెంట్స్ సమక్షంలో రిలీజ్ చేశారు.

ప్రియదర్శి, విష్ణు ఓయ్, రాగ్ మయూర్, ప్రసాద్ బెహరా లీడ్ రోల్స్ లో సోషల్ మీడియా సెన్సేషన్ నిహారిక ఎన్.ఎం నటిస్తున్న సినిమా మిత్ర మండలి. ఈ సినిమాను బన్నీ వాసు బివి వర్క్స్ బ్యానర్ లో సమర్పిస్తుండగా సప్త అశ్వ మీడియా వర్క్స్, వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో కళ్యాణ్ మంతిన, భాను ప్రతాప్, విజయేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను విజయేందర్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈమధ్యనే ఫసట్ లుక్ టీజర్ తో ఇంప్రెస్ చేయగా లేటెస్ట్ గా సినిమాలోని మొదటి సాంగ్ రిలీజ్ చేశారు.

రెబల్ స్టార్ కృష్ణం రాజు ఐకానిక్ డైలాగ్ అయిన కత్తందుకో జానకి అనే లిరిక్స్ తో ఈ సాంగ్ వచ్చింది. ఈ సాంగ్ ను కాసర్ల శ్యామ్ రచించగా ఆర్.ఆర్ ధృవన్ మ్యూజిక్ డైరెక్షన్ లో రాహుల్ సిప్లిగంజ్ పాడారు. సాంగ్ అయితే యూత్ ఆడియన్స్ కి ఇన్ స్టంట్ గా ఎక్కేసేలా ఉంది. ఈ సాంగ్ ను మేకర్స్ అమలాపురం కిమ్స్ కాలేజీలో స్టూడెంట్ సమక్షంలో రిలీజ్ చేశారు. ఈ సాంగ్ రిలీజ్ లో కిమ్స్ కాలేజీ యాజమాన్యంతో పాటు చిత్ర యూనిట్ కూడా పాల్గొన్నారు. ఈమధ్య ప్రియదర్శి నటిస్తున్న సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అవుతున్నాయి. సో మిత్ర మండలి సినిమాకు అతని లక్ కలిసి వస్తుందేమో చూడాలి.