Begin typing your search above and press return to search.

మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రికానింగ్ టాక్ ఏంటి..?

టామ్ క్రూజ్ స్టంట్స్ కోసమే మిషన్ ఇంపాజిబుల్ సినిమాలు చూసే ఫ్యాన్స్ ఉన్నారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అతను చేసే విన్యాసాలు మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తాయి.

By:  Tupaki Desk   |   16 May 2025 5:14 PM IST
మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రికానింగ్ టాక్ ఏంటి..?
X

యాక్షన్ సినీ ప్రియులకు మిషన్ ఇంపాజిబుల్ సీరీస్ లు చూడటం అంటే భలే ఇష్టపడతారు. హై యాక్షన్ స్టంట్స్, సాహస విన్యాసాలతో వెండితెర మీద అద్భుతాలు చేసింది మిషన్ ఇంపాజిబుల్. ఐతే ఆ సీరీస్ ని కొనసాగిస్తూ వస్తున్నారు మేకర్స్. రెండేళ్ల క్రితమే మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రికానింగ్ తీశారు. ఐతే అది పార్ట్ 1 కాగా దానికి కొనసాగింపుగా లేటెస్ట్ గా మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రికానింగ్ అనే సినిమా వచ్చింది. లేటెస్ట్ గా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేసింది.

మామూలుగా అయితే మిషన్ ఇంపాజిబుల్ సీరీస్ ల మీద ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. వాటికి తగినట్టుగానే ఈ సీరీస్ లు చేస్తూ వస్తున్నారు. ఐతే రెండేళ్ల క్రితం వచ్చిన మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రికానింగ్ పార్ట్ 1 రాగా దానికి సీక్వెల్ గానే మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రికానింగ్ వచ్చింది. పార్ట్ 1 ని కొనసాగిస్తూ ఆ తర్వాత IMF ఏజెంట్ ఈథన్ హంట్ మిషన్ లో దిగడం తో ఈ సినిమా మొదలవుతుంది. ది ఏంటిటి అనే AI ప్రోగ్రాం ని గాబ్రియేల్ కి దక్కకుండా ఆపేందుకే ఈ పోరాటం జరుగుతుంది. ఐతే ఈ మిషన్ లో అతను సక్సెస్ అయ్యాడా లేదా అన్నదే ఈ సినిమా కథ.

మిషన్ ఇంపాజిబుల్ సీరీస్ అన్నిటిలో కూడా కథ మరీ అంత గొప్పగా ఏమి ఉండదు. ప్రపంచాన్ని రక్షించే ఏజెంట్ ఈథన్ అంట్ చేసే స్టంట్స్ తోనే వచ్చాయి. ఐతే ఈ సినిమాలో కూడా టామ్ క్రూజ్ అదిరిపోయే స్టంట్స్ చెశాడు. అతను ఉన్న 60 ప్లస్ ఏజ్ లో ఇలా చేయడం అన్నది గొప్ప విషయం. ముఖ్యంగా ఎలాంటి డూప్స్, గ్రాఫిక్స్ లాంటివి లేకుండా టామ్ క్రూజ్ చేసిన ఈ విన్యాసాలు నెక్స్ట్ లెవెల్ అనిపిస్తాయి. మిషన్ ఇంపాజిబుల్ అంటేనే టామ్ క్రూజ్ అనేలా సీరీస్ లు చేస్తూనే వచ్చాడు. ఈ సినిమాలో కూడా అతను మళ్లీ అబ్బురపరిచారు.

టామ్ క్రూజ్ స్టంట్స్ కోసమే మిషన్ ఇంపాజిబుల్ సినిమాలు చూసే ఫ్యాన్స్ ఉన్నారు. ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అతను చేసే విన్యాసాలు మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తాయి. ఈ సినిమాలో కూడా ఈథన్ హంట్ గా అతను చూపించే తెగువ వేరే లెవెల్ అనిపిస్తుంది. కేవలం టామ్ క్రూజ్ నటన, స్టంట్స్ వల్లే సినిమా ఇంప్రెస్ చేసేలా ఉందనిపిస్తుంది. ఐతే అతనితో పాటు హేలీ అట్వెల్, వింగ్ రేమ్స్, సైమన్ పె, హెన్రీ జెర్నీ, ఏంజెలా బాసెట్ లాంటి వారు కూడా ఈ సినిమాలో తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఐతే ఈ సినిమాలో కథనం కాస్త స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. అక్కడక్కడ బోర్ కొట్టినట్టుగా ఉంటుంది. ఇలాంటి యాక్షన్ అడ్వెంచర్ సినిమాల్లో స్క్రీన్ ప్లే ఎంత వేగంగా ఉంటే అంత బాగుంటుంది. కానీ అక్కడక్కడ స్క్రీ ప్లే ట్రాక్ తప్పుతుంది. ఇక ఈ సినిమా రెండు గంటల 49 నిమిషాల లెంగ్త్ తో వచ్చింది. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుంటే బాగుండేది. అయినా కూడా యాక్షన్ ప్రియులతో పాటు టామ్ క్రూజ్ స్టంట్స్ చూసి ఆనందపడే వారికి మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రికానింగ్ నచ్చుతుంది.