RFCలో మెగా 157..!
ఆర్ఎఫ్సీలో సినిమాకు సంబందించిన ఫైట్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారట. ఐతే ఈ షూటింగ్ దాదాపు నాలుగు రోజుల పాటు ఉంటుందని తెలుస్తుంది.
By: Tupaki Desk | 8 July 2025 10:35 PM ISTమెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమాను షైన్ స్క్రీన్ బ్యానర్ లో సాహు గారపాటి నిర్మిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ఈ ప్రాజెక్ట్ లో ఫిమేల్ లీడ్ గా నటిస్తుంది. మెగా 157 సినిమాను అనిల్ అనుకున్న దానికన్నా వేగంగా చేస్తున్నట్టు తెలుస్తుంది. సినిమాకు ఏ షెడ్యూల్ అయినా సరే ఒకరోజు ముందే పూర్తి చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజి ఫిల్మ్ సిటీలో జరుగుతుంది.
ఆర్ఎఫ్సీలో సినిమాకు సంబందించిన ఫైట్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారట. ఐతే ఈ షూటింగ్ దాదాపు నాలుగు రోజుల పాటు ఉంటుందని తెలుస్తుంది. ఆర్ఎఫ్సీలో మెగా 157 హంగామా మొదలైందట. సినిమాకు కీలకమైన ఈ ఫైట్ ని భారీ యాక్షన్ ఎపిసోడ్ గా ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.
చిరంజీవి అనిల్ రావిపూడి కాంబో సినిమా అటు అనిల్ మార్క్ ఎంటర్టైన్ మెంట్ అందిస్తూనే మెగా ఫ్యాన్స్ కి కావాల్సిన మాస్ అంశాలు అందిస్తున్నారట. ఈ సినిమాకు భీమ్స్ మ్యూజిక్ అందిస్తున్నాడు. పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం వరకు తీసిన సినిమాలన్నీ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి మెగా బాస్ తో చేస్తున్న ఈ సినిమాతో కూడా సూపర్ హిట్ టార్గెట్ పెట్టారు.
ఈ సినిమాను అనిల్ రావిపూడి సెంటిమెంట్ ప్రకారంగా 2026 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇప్పటికే సినిమా రషెస్ చూసిన చిత్ర యూనిట్ సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది. మెగా 157 సినిమా మెగా ఫ్యాన్స్ కి ఒక మర్చిపోలేని ట్రీట్ అందిస్తుందని అంటున్నారు. ఈ సినిమాలో అనిల్ ఒక్కసారి వింటేజ్ చిరంజీవిని గుర్తు చేస్తాడని అంటున్నారు. అదే జరిగితే మాత్రం మెగా 157 రికార్డులు తిరగరాయడం గ్యారెంటీ అని చెప్పొచ్చు.
తను తీసే ప్రతి స్టార్ కి మంచి సక్సెస్ ఫుల్ సినిమాను అందిస్తున్న అనిల్ రావిపూడి మెగా 157 సినిమాతో మెగా ఫ్యాన్స్ కి మంచి పండగ లాంటి సినిమా అందిస్తాడని అంటున్నారు. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా గెస్ట్ రోల్ లో కనిపిస్తారని టాక్. సో మెగా 157 కోసం అనిల్ ప్లానింగ్ చూస్తుంటే ఇది కూడా ఆయన ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ అనేలా ఉంది.