ఈ వారం రిలీజులివే..!
మరి ఏ సినిమాలు థియేటర్లలో రిలీజవుతున్నాయి? ఏ సినిమాలు ఏ ఓటీటీల్లో రిలీజవుతున్నాయన్నది చూద్దాం.
By: Tupaki Desk | 28 April 2025 4:29 PM ISTమే నెల వచ్చేసింది. పిల్లలకు సమ్మర్ హాలిడేస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ప్రతీ సమ్మర్ లాగానే ఈ సమ్మర్ ను కూడా పలు సినిమాలు టార్గెట్ చేసి క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారు. మే ఫస్ట్ వీక్ లో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ను అందించడానికి పలు సినిమాలు రెడీ అయ్యాయి. వాటిలో కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజవుతుండగా మరికొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజవుతున్నాయి. మరి ఏ సినిమాలు థియేటర్లలో రిలీజవుతున్నాయి? ఏ సినిమాలు ఏ ఓటీటీల్లో రిలీజవుతున్నాయన్నది చూద్దాం.
థియేటర్ రిలీజులివే..
హిట్3: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ సినిమా మే 1న రిలీజ్ కానుంది.
రెట్రో: సూర్య హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
రైడ్2: అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రం మే 1న విడుదల అవుతోంది.
భూత్నీ: సంజయ్ దత్, సన్నీ సింగ్ ల సినిమా కూడా మే 1న రిలీజ్ కు రెడీ అయింది.
ఈ సినిమాలు భారీ అంచనాలతో థియేటర్లలో రిలీజవుతుండగా, మరికొన్ని సినిమాలు, సిరీస్ లు ఓటీటీలో రిలీజవుతున్నాయి. అవేంటంటే..
నెట్‌ఫ్లిక్స్‌లో..
చెఫ్స్ టేబుల్: లెజెండ్ అనే సిరిస్ ఏప్రిల్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
ఎక్స్‌టెరిటోరియల్ మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ అవుతుంది.
ది ఎటర్నాట్ ఏప్రిల్ 30న నుంచి అందుబాటులోకి రానుంది.
ఆస్ట్రిక్స్ అండ్ ఒబెలిక్స్: ది బిగ్ ఫైట్ అనే మినీ సిరీస్ ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది.
టర్నింగ్ పాయింట్: ది వియత్నాం వార్ అనే వెబ్ సిరీస్ ఏప్రిల్ 30 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ది రాయల్స్ అనే వెబ్ సిరీస్ మే 1న రిలీజ్ కానుంది.
యాంగి: ఫేక్ లైఫ్, ట్రూ క్రైమ్ మే 1వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.
ది బిగ్గెస్ట్ ఫ్యాన్ మే 1 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ది ఫోర్ సీజన్స్ అనే వెబ్ సిరీస్ మే 1వ తేదీన రిలీజ్ కానుంది.
బ్యాడ్ బాయ్ అనే వెబ్ సిరీస్ మే 2 నుంచి అందుబాటులోకి రానుంది.
హాట్ స్టార్‌లో..
కుల్ల్: ది రైసింగ్స్ అనే వెబ్ సిరీస్ మే 2న రిలీజ్ కానుంది.
ది బ్రౌన్ హార్ట్ అనే డాక్యుమెంటరీ మే 3 నుంచి స్ట్రీమింగ్ లోకి రానుంది.
ప్రైమ్ వీడియోలో..
అనదర్ సింపుల్ ఫేవర్ మూవీ మే 1న రిలీజ్ కానుంది.
జీ5లో..
కొస్టావో అనే సినిమా మే 1న విడుదల కానుంది.
ఆహాలో..
వేరే లెవల్ ఆఫీస్ రీలోడెడ్ మే 1వ తేదీన రిలీజ్ కానుంది.
సోనీలివ్ లో..
బ్రొమాన్స్ మూవీ మే 1వ తేదీన రిలీజ్ కానుంది.
బ్లాక్, వైట్ అండ్ గ్రే: లవ్ కిల్స్ అనే వెబ్ సిరీస్ మే 1వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
ఎంఎక్స్ ప్లేయర్ లో..
ఈఎమ్ఐ మే 1న రిలీజ్ కానుంది.
టుబి లో..
సిస్టర్ మిడ్‌నైట్ మే 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
యాపిల్ టీవీ ప్లస్ లో..
కేర్ మీ మూవీ ఏప్రిల్ 30న రిలీజ్ కానుంది.