క్షమాపణలు చెప్పడం ఇదే తొలిసారా?
భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన `థగ్ లైఫ్` ఆ అంచనాలు అందుకోవడంలో ఘోరంగా వైఫల్యం చెందిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 24 Jun 2025 11:10 AM ISTభారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన 'థగ్ లైఫ్' ఆ అంచనాలు అందుకోవడంలో ఘోరంగా వైఫల్యం చెందిన సంగతి తెలిసిందే. దీంతో దర్శకుడు మణిరత్నం ప్రేక్షకుల్ని క్షమాపణలు కోరారు. తన వైపు నుంచి క్షమాపణలు తప్ప ఇంకే చెప్పలేనన్నారు. ఇలా ప్రేక్షకుల్ని క్షమాపణలు కోరడం అన్నది బహుశా ఇదే తొలిసారి కావొచ్చు. దర్శకుడిగా ఇప్పటివరకూ ఎన్నో సినిమాలు చేసారు.
వాటిలో విజయాలతో పాటు పరాజయాలు ఎన్నో ఉన్నాయి. మరి పరాజయం చెందిన ప్రతీసారి మణిరత్నం క్షమాపణలు కోరారా? అంటే లేదు. కేవలం 'థగ్ లైఫ్' విషయంలోనే ఆ సన్నివేశం చోటు చేసుకుంది. అందుకు ఓ ప్రత్యేక కారణం ఉంది. ప్రేక్షకుల్లో `థగ్ లైఫ్` పై ఉన్న అంచనాలే అందుకు కారణంగా మారాయి. కమల్ హాసన్-మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ ప్రకటన రాగానే అంచనాలు ఒక్కసారిగా పీక్స్ కి చేరాయి. దాదాపు 37 ఏళ్ల తర్వాత కలిసి పనిచేయడంతోనే ఈ రేంజ్ లో అంచనాలు మొదలయ్యాయి.
'నాయకుడు' తర్వాత మళ్లీ ఆ ఛాన్స్ తీసుకోలేదు. అప్పట్లో 'నాయకుడు' ఎంతో గొప్ప విజయం సాధిం చింది. దీంతో ఆ రేంజ్ సినిమా వస్తుందని అంతా ఎక్స్ పక్ట్ చేసారు. కానీ ఏ మాత్రం ఊహించని సినిమాని అందించి ప్రేక్షకుల్ని పరీక్షించారు. కమల్-మణిరత్నం ఇంత చెత్త సినిమా తీసారేంటి అనే పరిస్థితి ఎదురైంది. ప్రేక్షకులంతా విమర్శించారు. మణిరత్నంపై ఉన్న నమ్మకంతో కమల్ హాసన్ ముందు కొచ్చారు. ఆ నమ్మకాన్ని మణిసార్ నిలబెట్టుకోలేకపోయారు. ఈ విషయంలో కమల్ అభిమానులు ఎంతో నిరుత్సా హాని గురయ్యారు.
మణిరత్నం మీద ఉన్న గౌరవంతో నేరుగా విమర్శించలేకపోయారు గానీ లేదంటే నేటి విమర్శ సోషల్ మీడియాలో ఏ స్థాయిలో ఉందో తెలిసిందే. అవన్నీ మణిరత్నం దృష్టికి వెళ్లాయి. ప్రత్యే కంగా కమల్ హాసన్ తో మణిరత్నం ర్యాపో ఎంతో గొప్పది. కమల్ కంటూ ప్రత్యేకమైన ప్యాన్ బేస్ ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టు కునే మణిరత్నం క్షమాపణలతో ముందుకొచ్చారు. అప్పుడప్పుడు దర్శక-హీరోలు ఇలాంటి పరి స్థితిని ఎ దుర్కోవడం అన్నది సహజమే. సినిమా ప్లాప్ అయినప్పుడు కొంత మంది హీరోలు కూడా మీడియా ముందుకొచ్చి క్షమాపణలు అడుగుతుంటారు.