కన్నప్ప స్టార్ ఫ్యాన్స్ కి డైరెక్టర్ హామీ.. చివరి గంట అద్భుతం..!
రిలీజ్ దగ్గర పడుతున్న టైం లో సినిమా దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మీడియాతో ముచ్చటించారు. సినిమా గురించి డైరెక్టర్ ముఖేష్ ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.
By: Tupaki Desk | 24 Jun 2025 5:45 PM ISTమంచు విష్ణు డ్రీం ప్రాజెక్ట్ గా తెరకెక్కిన కన్నప్ప సినిమా రిలీజ్ కు ఇంకా మూడు రోజులు మాత్రమే ఉంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై ఎం. మోహన్ బాబు నిర్మించిన సినిమా కన్నప్ప. ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేశారు. సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా సూపర్ బజ్ ఏర్పరచింది. రిలీజ్ దగ్గర పడుతున్న టైం లో సినిమా దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ మీడియాతో ముచ్చటించారు. సినిమా గురించి డైరెక్టర్ ముఖేష్ ఇంట్రెస్టింగ్ విశేషాలు పంచుకున్నారు.
తాను తీసిన మహాభారతం సీరియల్ చూసి విష్ణు టీం తనకు కాల్ చేశారని చెప్పారు ముఖేష్ కుమార్ సింగ్. మహాభారతం తానొక్కడినే కాదు కొన్ని ఎపిసోడ్స్ నేను డైరెక్ట్ చేశా నాతో పాటు ఇంకా కొంతమంది దర్శకులు ఉన్నారని చెప్పానని అన్నారు. ఐతే ఆ తర్వాత ఆచారి అమెరికా యాత్ర సినిమా టైం లో అనూప్ ఠాకూర్ తన గురించి చెప్పారని అప్పుడు మళ్లీ విష్ణు టీం తనని అప్రోచ్ అయ్యారని చెప్పారు ముఖేష్ కుమార్ సింగ్.
మంచు విష్ణు పిలుపు మేరకు హైదరాబాద్ వచ్చి కన్నప్ప కథ విన్నాను. అప్పటికి కన్నప్ప గురించి తనకు ఏమి తెలియదు. కానీ కథ చెప్పిన తర్వాత రీసెర్చ్ చేశానని అన్నారు ముఖేష్ కుమార్. ఆ తర్వాత మోహన్ బాబు గారు పిలిచి మహాభారతం సెరియల్ గురించి మాట్లాడి ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పి డైరెక్టర్ గా తనను ఫైనల్ చేశారని ముఖేష్ కుమార్ సింగ్ వెల్లడించారు.
బుల్లితెరపై తాను చేసిన ప్రాజెక్టులు అన్నీ కూడా హై బడ్జెట్ తో చేశానని అన్న ముఖేష్ కుమార్ సింగ్. స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ ఎక్కడ పనిచేసినా ఒకే మైండ్ సెట్ తో పనిచేస్తానని అన్నారు ముఖేష్.
ఇక కన్నప్ప సినిమా కోసం ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా పనిచేశారని చెప్పారు. అక్షయ్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, మోహన్ బాబు, విష్ణు, బ్రహ్మానందం ఇలా అందరితో పనిచేయడం ఒక మర్చిపోలేని అనుభూతి అని అన్నారు ముఖేష్. కన్నప్ప మీద ఇదివరకు వచ్చిన సినిమాలు చూశాను. ఇక విష్ణు గురించి చెబుతూ విష్ణు కన్నప్ప పాత్రకు వంద శాతం న్యాయం చేశారని చివరి గంట అద్భుతం అని అన్నారు దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్.
సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ కూడా చాలా రీసెర్చ్ చేశారు. ఎన్నో మ్యూజియంలను సందర్శించారని చెప్పారు. సినిమాలో క్యాస్టూమ్స్, వెపన్స్ ఇలా అన్నీ కూడా పరిశోధన చేసి సిద్ధం చేశామని అన్నారు. రెండో శతాబ్దం నాటి వాతావరణం తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చేశామని చెప్పిన ముఖేష్ కుమార్ అందుకు న్యూజిలాండ్ వెళ్లామని చెప్పారు.
కన్నప్ప సినిమాలో ప్రభాస్ పాత్ర ఎంతో పవర్ ఫుల్ గా ఉంటుందని.. ఎవరి క్యారెక్టర్ కూడా ఇలా వచ్చి అలా వెళ్లేలా ఉండదని అన్నారు. అన్ని క్యారెక్టర్స్ ఆడియన్స్ లో ప్రభావాన్ని చూపిస్తాయని చెప్పుకొచ్చారు. ఏ స్టార్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా చూసి నిరాశ చెందరని అన్నారు ముఖేష్. ఈ మూవీ ఇప్పటివరకు చూసిన వాళ్లంతా అద్భుతం అనేస్తున్నారని వెల్లడించారు.
కన్నప్ప మీద ఇదివరకు తీసిన సినిమాల్లో కాస్త లిబర్టీ తీసుకున్నారు. ఐతే ఇందులో కూడా ఫిక్షనల్ పార్ట్ ఉంటుంది. శ్రీకాళహస్తి అర్చకులకు సినిమా చూపించాం.. వాళ్లు మూవీ అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారని ముఖేష్ కుమార్ సింగ్ చెప్పారు. కన్నప్ప అంటే ఇదేదో మైథలాజికల్ సినిమా అనుకుంటున్నారు. ఇది మన హిస్టరీ.. ఒక సంఘటనని ఒక్కొక్కరు ఒక్కోలా చెబుతారు. కన్నప్ప ఎవరికీ సరిగా తెలియదు. కన్నప్ప తన కంటిని శివుడికి ఇచ్చాడు.. ఇదంతా చరిత్ర అని అన్నారు ముఖేష్ కుమార్.
ఇక చివరగా మహాభారతం సీరియల్ తీశాం కాబట్టి దాన్ని సినిమాగా తీయాలని అనుకుంటున్నట్టు వెల్లడించారు ముఖేష్ కుమార్ సింగ్. ఐతే మహాభారతం ఇప్పటికే రాజమౌళి తీద్దామని అనుకుంటున్నారు కదా అని డౌట్ రావొచ్చు. దానికి క్లారిటీ ఇస్తూ మహాభారతం పబ్లిక్ ప్రాపర్టీ.. అది ఎవరైనా తీసుకోవచ్చు.. రాజమౌళి గారు తీయొచ్చు.. అమీర్ ఖాన్ తీసుకోవచ్చు అంటూ చెప్పారు ముఖేష్ కుమార్ సింగ్.