Begin typing your search above and press return to search.

ఇతడు లేకుంటే చాలా నష్టం జరిగేది : మాళవిక

ప్రభాస్‌, మారుతిల కాంబోలో రూపొందుతున్న 'రాజాసాబ్‌' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్న ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌. ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా దశాబ్ద కాలం అయింది.

By:  Tupaki Desk   |   24 Jun 2025 3:24 PM IST
ఇతడు లేకుంటే చాలా నష్టం జరిగేది : మాళవిక
X

ప్రభాస్‌, మారుతిల కాంబోలో రూపొందుతున్న 'రాజాసాబ్‌' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం కాబోతున్న ముద్దుగుమ్మ మాళవిక మోహనన్‌. ఈ అమ్మడు ఇండస్ట్రీలో అడుగు పెట్టి దాదాపుగా దశాబ్ద కాలం అయింది. ఇప్పటి వరకు ఈ అమ్మడు టాలీవుడ్‌లో నటించలేదు. ఆ మధ్య ఒకటి రెండు చిన్నా చితకా ఆఫర్లు వచ్చినప్పటికీ పెద్దగా పట్టించుకోలేదు. తమిళ్‌, మలయాళం సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో ఇన్నాళ్లు కొనసాగుతూ వచ్చినా కూడా టాలీవుడ్‌లో ఈ అమ్మడికి మంచి ఫ్యాన్‌ బేస్ ఏర్పడింది. తెలుగులో ఈ అమ్మడు చేసిన సినిమాలు లేకపోయినా కూడా తమిళ్‌, మలయాళ డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు ఈ అమ్మడు చేరువ అయింది. ఇండస్ట్రీలో ఈ అమ్మడికి మంచి గుర్తింపు లభించింది.


ఇతర భాషల్లో చేసిన సినిమాల కారణంగానే ఈ అమ్మడికి ఏకంగా ప్రభాస్‌తో రాజాసాబ్‌ సినిమాను చేసే అవకాశం దక్కింది. రాజాసాబ్‌ విడుదల తర్వాత కచ్చితంగా టాలీవుడ్‌లో మోస్ట్‌ బిజీ హీరోయిన్‌గా ఈ అమ్మడు మారే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈమె ప్రభాస్‌ మూవీ రాజాసాబ్‌తోనే కాకుండా తమిళ్‌లో సర్దార్‌ 2 సినిమాలో నటిస్తుంది. ఆ సినిమాపై కూడా ఈ అమ్మడు చాలా ఆశలు పెట్టుకుంది. మరో వైపు మలయాళ సినిమాలోనూ ఈమె నటిస్తుంది. ఒకే సారి మూడు భాషల సినిమాల్లో నటిస్తోంది. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియా ద్వారా తన అందమైన ఫోటోలను షేర్‌ చేయడంలో మాత్రం ఎప్పుడూ ఆలస్యం చేయదు. రెగ్యులర్‌గా అందమైన ఫోటోలు షేర్‌ చేస్తూ ఉంటుంది.

తన అందాల ఆరబోత ఫోటోలు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు వర్కౌట్‌ వీడియోలు, యోగా ఫోటోలు, జిమ్‌లో ఉన్న ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. తాజాగా జిమ్‌లో ఉన్న ఫోటోను షేర్‌ చేసింది. ఈ ఫోటోలో తన జిమ్‌ ట్రైనర్‌ను చూపించింది. ఇతడు లేకుంటే నేను చాలా నష్టపోయేదాన్ని అంది. నా జీవితంలో ఇతడు లేకుంటే నా ఫిజిక్‌ ఇలా ఉండేది కాదు, నేను ఖచ్చితంగా ఫిజిక్‌ పరంగా ఇబ్బందులు ఎదుర్కొనే దాన్ని అనే అర్థం వచ్చే విధంగా పోస్ట్‌ చేసింది. అంతే కాకుండా ఆయనతో ఉన్న ఫోటోను షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. హీరోలు, హీరోయిన్స్‌ వ్యక్తిగత ట్రైనర్స్ ఆధ్వర్యంలో జిమ్‌లో వర్కౌట్‌లు చేస్తూ ఉంటారు. మాళవిక సైతం తన వ్యక్తిగత జిమ్‌ ట్రైనర్‌ సమక్షంలో వర్కౌట్‌లు చేసి సన్నగా నాజుకుగా కనిపిస్తూ మరింత అందంగా మారుతుంది.

కేరళలో పుట్టి పెరిగిన ఈ అమ్మడికి చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీపై ఆసక్తి ఏర్పడింది. సినిమాటోగ్రాఫర్‌ కె యు మోహనన్ కుమార్తె ఈమె. మలయాళ చిత్రం పట్టం పోల్‌ తో ఎంట్రీ ఇచ్చింది. కేరళలోని కన్నూర్‌ జిల్లాలోని పయ్యనూర్‌ పట్టణంలో ఈమె జన్మించింది. కేరళలో పుట్టిన ఈమె ముంబైలో పెరగడం వల్ల అక్కడి పద్ధతులు అలవాటు అయ్యాయి. మోడలింగ్‌ పై ఆసక్తితో పాటు, నాటకాలపై ఆసక్తితో నటనలో శిక్షణ తీసుకుంది. డాన్స్‌లోనూ ప్రావిణ్యం సంపాదించింది. అందుకే హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకుంది. సోషల్‌ మీడియాలో ఈమెను ఏకంగా 47 లక్షల మంది ఫాలో అవుతున్నారు. భారీ ఎత్తున ఫాలోవర్స్ ఉన్న ఈ అమ్మడు రెగ్యులర్‌గా స్కిన్‌ షో ఫోటోలు షేర్‌ చేస్తూ ఉంటుంది. దాంతో ఈ అమ్మడికి ఫాలోయింగ్‌ అంతకంతకు పెరుగుతూనే ఉంది.