సత్యభామ అన్నింటికి రెడీగానే!
కోలీవుడ్ చిత్రం `జో`తో మాళవిక మనోజ్ నెట్టింట బాగా పాపులర్ అయింది. లవ్ స్టోరీ `జో` తో మాళవిక అభినయం యువతను ఫిదా చేసింది.
By: Tupaki Desk | 8 July 2025 11:00 PM ISTకోలీవుడ్ చిత్రం 'జో'తో మాళవిక మనోజ్ నెట్టింట బాగా పాపులర్ అయింది. లవ్ స్టోరీ 'జో' తో మాళవిక అభినయం యువతను ఫిదా చేసింది. యూత్ పుల్ లవ్ స్టోరీ యువతకు కనెక్ట్ అవ్వడంతో మాళవికకు సోషల్ మీడియాలో ప్రత్యేకమైన ప్యాన్ బేస్ ఏర్పడింది. జో చిత్రానికి సంబంధించిన షాట్స్ నెట్టింట వైరల్ అవ్వడంతో అమ్మడు క్రేజీ బ్యూటీగా మారింది. తాజాగా మాళవిక మనోజ్ `ఓభామ అయ్యో రామ` చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇస్తుంది.
ఇందులో అమ్మడు సుహాస్ కు జోడీగా నటిస్తోంది. జో సినిమా కారణంగానే ఈ చిత్రంలో అవకాశం వచ్చినట్లు తెలిపింది. తెలుగు భాష రాకపోయినా అందులో భావాన్ని అర్దంచేసుకుని పాత్రకు కనెక్ట్ అయినట్లు చెప్పుకొచ్చింది. సినిమాలో ఓ సీన్ కోసం ఈత రాకపోయినా నీళ్లలోకి దూకి ఈత కొట్టినట్లు తెలిపింది. అలాగే తదుపరి చిత్రాల్లో రొటీన్ పాత్రలకంటే వైవిథ్యమైన పాత్రలు..సవాల్ విసిరే రోల్స్ మాత్రమే చేస్తానంది.
రెగ్యులర్ రోల్స్ చేయనని తెలిపింది. మరి ఈ నేచురల్ బ్యూటీ గ్లామర్ పాత్రలకు రెడీగా ఉందా? అంటే అందుకు ఏమాత్రం వెనకడుగు వేయనని చెప్పింది. గ్లామర్ పాత్రలు చేయాలా? వద్దా? అనే నిబంధన మాత్రం లేదని తెలిపింది. కథ నచ్చి చేసే పాత్ర సౌకర్యవంతంగా ఉంటే తప్పకుండా నటిస్తానంది. మొత్తానికి మాలీవుడ్ నుంచి మరో హద్దులు లేని బ్యూటీ టాలీవుడ్ కి రావడం విశేషం. సాధారణంగా మాలీవుడ్ భామలు గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటారు.
మాళవిక కెరీర్ ఓ విద్యార్దిని పాత్రతో మొదలైంది. అందులో అమ్మడు డీసెంట్ గాళ్ పాత్ర పోషిస్తుంది. స్వచ్ఛమైన లవ్ స్టోరీలో మాళవిక పెర్పార్మెన్స్ సినిమా హిట్ కు కీలక పాత్ర పోషించింది. అందులో హీరో-హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ ఎంతో స్వచ్ఛంగా ఉంటుంది. ఎలాంటి అసభ్యత లేకుండా తీసిన బ్యూటీఫుల్ లవ్ స్టోరీ అది. ఎమోషనల్ గానూ జో అంతే కనెక్ట్ అవుతుంది. అలాంటి బ్యూటీ గ్లామర్ గేట్లు ఎత్తేయడం ఇంట్రెస్టింగ్.