మహేష్ కెరీర్లోనే ఫస్ట్ టైమ్ ఇలా..
త్వరలోనే కొత్త షెడ్యూల్ కోసం ఎస్ఎస్ఎంబీ29 టీమ్ విదేశాలకు వెళ్లనుంది. ఇప్పటికే దాని కోసం వీసా ఏర్పాట్లు, ఇంటర్నేషనల్ లైసెన్స్ వర్క్స్ ను పూర్తి చేశాడు జక్కన్న.
By: Tupaki Desk | 29 April 2025 9:37 PM ISTఆర్ఆర్ఆర్ తో ఆస్కార్ ను టాలీవుడ్ కు తీసుకొచ్చిన దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కనీసం అనౌన్స్ కూడా చేయకుండానే సెట్స్ పైకి తీసుకెళ్లిన రాజమళి ఆల్రెడీ రెండు షెడ్యూళ్ల షూటింగ్ ను కూడా పూర్తి చేశాడు. రీసెంట్ గానే షూటింగ్ కు బ్రేక్ ఇవ్వగా మహేష్ ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్లొచ్చాడు.
త్వరలోనే కొత్త షెడ్యూల్ కోసం ఎస్ఎస్ఎంబీ29 టీమ్ విదేశాలకు వెళ్లనుంది. ఇప్పటికే దాని కోసం వీసా ఏర్పాట్లు, ఇంటర్నేషనల్ లైసెన్స్ వర్క్స్ ను పూర్తి చేశాడు జక్కన్న. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమా కోసం మహేష్ బాబు మేకోవర్ చేస్తున్నాడు. దాని కోసమే చాలా కాలంగా జుట్టు, గడ్డం పెంచుతున్నాడు.
అయితే మహేష్ రాజమౌళి సినిమా కోసం మేకోవర్ చేస్తున్నాడని తెలుసు కానీ ఆ లుక్ ఎలా ఉంటుందనేది మాత్రం ఇప్పటివరకు రివీల్ కాలేదు. రీసెంట్ గా మహేష్ వెకేషన్ కు వెళ్లినప్పుడు కూడా తన లుక్ బయట పడకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. ఎయిర్‌పోర్టు దగ్గర కూడా క్యాప్ పెట్టుకుని చాలా బాగా కవర్ చేసుకున్నాడు.
కానీ తాజాగా ఎవరితోనో డిస్కషన్స్ లో పాల్గొన్న మహేష్ ఫోటోలు బయటకు రాగా, అందులో అతని లుక్ బయటపడింది. ఈ ఫోటోల్లో మహేష్ పొడుగ్గా జుట్టు పెంచుకుని, గుబురు గడ్డంతో కనిపించాడు. మహేష్ ఇంతలా జుట్టు, గడ్డం పెంచడం తన కెరీర్లో ఇదే మొదటిసారి. ఈ లుక్ చూశాక రాజమౌళి సినిమాలో మహేష్ లుక్ చాలా కొత్తగా ఉంటుందని అర్థమైపోతుంది.
మొన్నా మధ్య ఒడిశా షూటింగ్ నుంచి మహేష్ కు సంబంధించిన ఓ క్లిప్ లీకవగా అందులో కూడా మహేష్ లుక్ లీకైంది. కానీ ఆ క్లిప్ క్లారిటీ లేకపోవడంతో మహేష్ లుక్ పెద్దగా బయటపడలేదు. ఆ లీక్ తర్వాత రాజమౌళి మరింత జాగ్రత్తగా ఉంటూ సినిమాలోని ఎవరి లుక్ రివీల్ కాకుండా ఎంతో జాగ్రత్త పడుతున్నాడు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే.