Begin typing your search above and press return to search.

అతడు రీ రిలీజ్.. అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి!

దీంతో భారీ రేటుకు ఈ సినమా 4K రీ రిలీజ్ హక్కులు దక్కించుకొని, ఘనంగా విడుదల చేశారు. ఈ సినిమా రైట్స్ రూ.3.20 కోట్లకు కొనుగోలు చేశారు.

By:  Tupaki Desk   |   11 Aug 2025 12:33 PM IST
అతడు రీ రిలీజ్.. అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి!
X

మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా కల్ట్ క్లాసిక్ మూవీ అతడు రీ రిలీజ్ అయ్యింది. టెలివిజన్ లో అత్యధిక సార్లు టెలికాస్ట్ అయిన మూవీగా అతడుకు మంచి రికార్డు ఉంది. అలాగే ఈ సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ ఏర్పడడం వల్ల రీ రిలీజ్ లోనూ మంచి రెస్పాన్స్ ఉంటుందని బయ్యర్లు ఆశించారు.

దీంతో భారీ రేటుకు ఈ సినమా 4K రీ రిలీజ్ హక్కులు దక్కించుకొని, ఘనంగా విడుదల చేశారు. ఈ సినిమా రైట్స్ రూ.3.20 కోట్లకు కొనుగోలు చేశారు. అంటే సినిమా ఓవరాల్ రికవరీ అవ్వాలంటే రూ.3.50 కోట్లు వసూల్ చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా బజ్ సినిమాకు మంచి లాభాలు వస్తాయని ఆశించారు. కానీ ఇక్కడే ప్లాన్ రివర్స్ అయ్యింది అని తెలుస్తుంది.

టెలివిజన్ టీఆర్పీ, సోషల్ మీడియా బజ్ చూసి సినిమా రికవరీ చేస్తుందన్న నమ్మకంతో గట్టి రేటుకు కొనేశారు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్. ఈ మూవీ అనుకున్న రేంజ్ లో రీ రిలీజ్ రెస్పాన్స్ రాలేదు. కనీసం కొన్న ధరకు వర్కౌట్ అవ్వాలంటే ఇంకా రూ.1కోటి వసూల్ చేయాల్సి ఉంది అని తెలుస్తుంది . దీంతో బయ్యర్లు రూ.1 కోటి నష్టాన్ని చూసే అవకాశం ఉంది. అయితే ఇక్కడ బయ్యర్ కు ఓ ఊరట కలిగించే విశయం ఏంటంటే.. రీ రిలీజ్ హక్కులు ఏడాది వరకు ఉంటాయి.

అంటే ఒకవేళ రీ రిలీజ్ లో బయ్యర్లకు నష్టం జరిగితే.. ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఏడాదిలోపు మరోసారి రీ రిలీజ్ చేసుకునే వెసులుబాటు ఉందన్నమాట. ఇది బయ్యర్లకు కాంపెన్సేషన్ లాగా ఉంటుంది. షార్ట్ గ్యాప్ లో మరోసారి విడుదల చేసుకోవచ్చు. కానీ, అప్పుడు కూడా స్పందన రాకపోతే.. మరింత నష్టపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో బయ్యర్లు ఒకటి అనుకుంటే, ఇంకోటి జరిగిందని సోషల్ మీడియాలో నెటిజన్లు అంటున్నారు.

కాగా, మహేశ్ క్లాసిక్ హిట్ అతడును త్రివిక్రమ్ తెరకెక్కించారు. ఇందులో ఒక్కో డైలాగ్ బుల్లెట్ లాగా ఉంటుంది. అప్పుడు థియేటర్లలో మంచి విజయం సాధించడమే కాకుండా ఆ తర్వాత బుల్లితెరపైనా 1000కి పైగా సార్లు ప్రసారమై తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు, ఫ్యామిలీ ఆడియెన్స్ కు ఈ సినిమా చాలా దగ్గరైంది.