Begin typing your search above and press return to search.

రాజమౌళి రికార్డ్ ను కూడా బ్రేక్ చేసిన మహావతార్

చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది మహావతార నరసింహ.

By:  M Prashanth   |   11 Aug 2025 4:57 PM IST
రాజమౌళి రికార్డ్ ను కూడా బ్రేక్ చేసిన మహావతార్
X

చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తోంది మహావతార నరసింహ. ఈ యానిమేటెడ్ సినిమా జులై 25న రిలీజై.. ఓపెనింగ్ షో నుంచే మంచి మౌత్ టాక్ దక్కించుకుంది. అంతే సినిమా చూసేందుకు జనాలు థియేటర్ల వైపు క్యూ కడుతున్నారు. సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఇప్పటికే అనేక రికార్డులు బ్రేక్ చేసింది. తాజాగా మహవతార నరసింహ సినిమా మరో అరుదైన ఘనత అందుకుంది.

పెద్ద సినిమాలు సైతం రెండు వారాలు థియేటర్లలో ఆడలేని పరిస్థితులు ఉన్న ఈ రోజుల్లో మహావతార నరసింహ మూడు వారాలుగా డీసెంట్ ఆక్యుపెన్సీతో రన్ అవుతోంది. ఈ సినిమాకు వస్తున్న విశేష ఆదరణ చూసి ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్యపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమా రూ.150 కోట్ల వసూల్ చేసి.. రూ.200 కోట్ల మార్క్ వైపునకు దూసుకెళ్తుంది. మహావతార ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ సినిమాను అధిగమించింది.

విడుదలైన తర్వాత మూడో వీకెండ్ కూడా మహావతార సత్తా చాటింది. ఈ క్రమంలోనే గత శనివారం ఈ చిత్రం ఓవరాల్ గా దేశవ్యాప్తంగా రూ.25 కోట్లు వసూల్ చేసింది. దీంతో రిలీజైన తర్వాత మూడో శనివారం అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ నాలుగో సినిమాగా రికార్డు కొట్టింది. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ రూ.22 కోట్లును బీట్ చేసింది.

భారత్ లో మూడో శనివారం అత్యధిక వసూళ్లు సాధించిన లిస్ట్ లో బాహుబలి2 సినిమా ఉంది. ఇది రూ.36 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఈ సినమా తర్వాత వరుసగా పుష్ప రూ.29 కోట్లు, ఛావా రూ.27 కోట్లు, మహావతార నరసింహ రూ.25 కోట్లు, ఆర్ఆర్ఆర్ రూ.22 కోట్లు సినిమాలు లిస్ట్ లో ఉన్నాయి.

అయితే పైనున్న సినిమాలు భారీ బడ్జెట్ చిత్రాలు. అలాంచి సినిమాలకు మహావతార్ లాంటి ఓ యానిమేటెట్ సినిమా పోటీ పడడం అనేది సాధారణ విషయం కాదు. ఈ సినిమాకు హింది బెల్ట్ లో మంచి ఆదరణ లభిస్తోంది. విడుదలై మూడు వారాలు కావస్తున్నా.. ఇప్పటికీ థియేటర్లలో దీనికి అదిరే రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాతోపాుటు, ఆ తర్వాత వచ్చిన హరిహర వీరమల్లు, కింగ్డమ్ లాంటి చిత్రాలు పోయినప్పటికీ మహావతార ఇంకా కొనసాగుతోంది. కంటెంట్ ఉన్న సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమాతో రుజువైంది.