ఎస్ఎస్ఎంబీ29లో ఎవరూ ఊహించని పాత్రలో ఆ తమిళ నటుడు!
ప్రస్తుతం భారతదేశం మొత్తం ఎదురుచూస్తున్న ఇండియన్ సినిమా ఏదంటే అది ఎస్ఎస్ఎంబీ29. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మామూలు హైప్ లేదు.
By: Tupaki Desk | 8 July 2025 10:53 AM ISTప్రస్తుతం భారతదేశం మొత్తం ఎదురుచూస్తున్న ఇండియన్ సినిమా ఏదంటే అది ఎస్ఎస్ఎంబీ29. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మామూలు హైప్ లేదు. ఈ సినిమా నుంచి ఎలాంటి చిన్న వార్త వినిపించినా అది క్షణాల్లో నెట్టింట వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి మరో వార్త వినిపిస్తుంది.
ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ లో కోలీవుడ్ స్టార్ ఆర్. మాధవన్ జాయిన్ అయ్యారని, ఈ సినిమాలో ఆయన మహేష్ కు తండ్రి పాత్రలో నటించనున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. గతంలో ఈ పాత్ర కోసం నానా పటేకర్, విక్రమ్ లాంటి నటుల్ని సంప్రదించారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఫైనల్ గా ఆ పాత్ర మాధవన్ కు దక్కిందంటున్నారు.
ఇదే నిజమైతే మాధవన్ ఈ పాత్రను చేయడం చాలా ఆసక్తికరంగా మారడం ఖాయం. మ్యాడీ ఎంత గొప్ప నటుడనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఒదిగిపోగల మాధవన్ నిజంగా మహేష్ కు తండ్రి పాత్రలో నటిస్తే, అది కూడా జక్కన్న డైరెక్షన్ లో. ఆ పాత్ర నెక్ట్స్ లెవెల్ లో ఉండటం ఖాయం. అయితే ఇవన్నీ ప్రస్తుతానికి ఊహాగానాలు మాత్రమే. ఇప్పటివరకు చిత్ర యూనిట్ నుంచి ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వచ్చింది లేదు.
కాగా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ను పూర్తి చేసిన ఎస్ఎస్ఎంబీ29 ఇప్పుడు కొత్త షెడ్యూల్ కోసం కెన్యా వేళ్ళ వలసి ఉంది. ఫారెస్ట్ అడ్వెంచర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఉంటుందని ఇప్పటికే రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 9న మహేష్ బర్త్ డే సందర్భంగా జక్కన్న తమకు ఏదైనా స్పెషల్ ట్రీట్ ఇస్తారేమో అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి జక్కన్న ప్లాన్ ఏంటో చూడాలి.