Begin typing your search above and press return to search.

విక్రమ్ లో సూర్య.. మరి కూలీలో ఎవరు..?

లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో వస్తున్న సినిమాలకు క్రేజ్ మామూలుగా ఉండదు. ఆయన చేస్తున్న సినిమాలు సెట్ చేస్తున్న కాంబినేషన్స్ ఈ క్రేజ్ ని డబుల్ చేస్తున్నాయి.

By:  Ramesh Boddu   |   12 Aug 2025 10:28 AM IST
విక్రమ్ లో సూర్య.. మరి కూలీలో ఎవరు..?
X

లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో వస్తున్న సినిమాలకు క్రేజ్ మామూలుగా ఉండదు. ఆయన చేస్తున్న సినిమాలు సెట్ చేస్తున్న కాంబినేషన్స్ ఈ క్రేజ్ ని డబుల్ చేస్తున్నాయి. ఖైదీతో అదరగొట్టి, విక్రం తో సూపర్ సెన్సేషన్ అనిపించుకున్న లోకేష్ కూలీ అంటూ వస్తున్నాడు. ఈ సినిమా మరో రెండు రోజుల్లో రిలీజ్ అవుతుంది అనగా సినిమా గురించి మరికొన్ని అప్డేట్స్ క్రేజీగా మారుతున్నాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ సినిమాలో కింగ్ నాగార్జున విలన్ గా నటిస్తున్నాడు.

నాగార్జున ఈ సినిమా ఒప్పుకోవడానికి రీజన్..

నాగార్జున విలనిజం వేరే లెవెల్ అనేలా ఉంటుందట. నాగార్జున ఈ సినిమా ఒప్పుకోవడానికి రీజన్ కూడా అదే అని టాక్. ఇక కన్నడ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ కూడా ఈ సినిమాలో భాగం అవుతున్నారు. ఐతే అమీర్ ఖాన్ ఈ సినిమాలో ఎలాంటి పాత్రలో నటిస్తాడా అన్న ఎగ్జైట్ మెంట్ ఆడియన్స్ లో ఉంది. ఐతే లేటెస్ట్ లీక్ ప్రకారం కూలీ సినిమాలో అమీర్ ఖాన్ రోల్ ఎప్పుడొస్తాడన్నది లీకైంది.

లోకేష్ కనకరాజ్ విక్రం సినిమాలో ఎలాగైతే సూర్యని రోలెక్స్ పాత్రలో క్లైమాక్స్ లో ఇంట్రడ్యూస్ చేశాడి.. అలానే కూలీ సినిమాలో రోలెక్స్ గా అమీర్ ఖాన్ వస్తాడట. అఫ్కోర్స్ ఆ పాత్ర పేరు వేరు కావొచ్చు కానీ విక్రం కి సూర్య వచ్చి ఎలా హై ఇచ్చాడో దానికి డబుల్ ఇంపాక్ట్ ఇచ్చేలా అమీర్ రోల్ ఉంటుందట. ఆల్రెడీ ట్రైలర్ లో అమీర్ ఖాన్ యాక్షన్ సీన్స్ సూపర్ అనిపించాయి.

క్లైమాక్స్ లో అమీర్ ఖాన్ ఎంట్రీ..

ఇక కూలీ సినిమా క్లైమాక్స్ లో అమీర్ ఖాన్ ఎంట్రీ అదిరిపోతుందట. తప్పకుండా కూలీలో ప్రతి ఒక్క స్టార్ వర్తబుల్ అనిపించేలా చేస్తాడని అంటున్నారు. లోకేష్ రజిని ఈ కాంబో సినిమపై ఉన్న అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా కూలీ ఉంటుందట. సినిమాకు వార్ 2 రూపంలో పెద్ద త్రెట్ ఉన్నా కూడా కూలీ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది.

విక్రం సినిమా అంతా ఒక ఎత్తు చివర్లో రోలెక్స్ లో సూర్య వచ్చి చేసింది మరో ఎత్తు అనేలా ఆ పోర్షన్ ఉంటుంది. సూర్య కి కూడా తనని అందరు అలాంటి రోల్ లో చూడాలని కోరుతున్న విషయం గుర్తించాడు. అందుకే అతను కార్తీక్ సుబ్బరాజుతో రెట్రో చేశాడు. ఇక కూలీ సినిమాలో రోలెక్స్ బాధ్యత అమీర్ ఖాన్ తీసుకున్నాడని తెలుస్తుంది. అది క్లిక్ అయితే మాత్రం అటు బాలీవుడ్ లో కూడా కూలీ రికార్డులు సృష్టిస్తుందని చెప్పొచ్చు.