Begin typing your search above and press return to search.

గురూజీ దృష్టిలో పడితే మాత్రం..?

లయ టాలెంట్ త్రివిక్రం కి తెలియనిది కాదు. సో కచ్చితంగా ఆయన దృష్టిలో ఆమె పడితే మాత్రం తప్పకుండా ఆమెకు ఒక మంచి రోల్ త్రివిక్రం సినిమాలో ఇస్తే మాత్రం తప్పకుండా లయ అదరగొట్టేస్తుంది.

By:  Ramesh Boddu   |   13 Aug 2025 2:00 PM IST
గురూజీ దృష్టిలో పడితే మాత్రం..?
X

ఒకప్పటి హీరోయిన్స్ అంతా కూడా కొన్నాళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చి పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేసి మళ్లీ రీ ఎంట్రీ ఇస్తూ అలరిస్తున్నారు. ఈ క్రమంలోనే రీసెంట్ గా తమ్ముడు సినిమాతో లయ కూడా రీ ఎంట్రీ ఇచ్చింది. శ్రీరాం వేణు డైరెక్షన్ లో తెరకెక్కిన తమ్ముడు సినిమాలో నితిన్ హీరోగా నటించాడు. ఆ సినిమాలో లయ సిస్టర్ రోల్ లో నటించింది. తమ్ముడు సినిమా మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. సినిమాలో ఆమె బాగానే చేసింది. కానీ డైరెక్టర్ శ్రీరాం వేణు ఫెయిల్ అయ్యాడు. నితిన్ నుంచి మంచి అవుట్ పుట్ తీసుకురాలేకపోయాడు. అందుకే తమ్ముడు ఎవరికీ కనెక్ట్ కాలేదు.

త్రివిక్రం సినిమాలోనే క్రేజ్..

ఐతే లయ లాంటి హీరోయిన్ రీ ఎంట్రీ అది కూడా మంచి సపోర్టింగ్ రోల్ చేస్తే ఆ సినిమా వర్క్ అవుట్ కాలేదు. ఐతే ఒకప్పటి హీరోయిన్స్ రీ ఎంట్రీ ఇవ్వాలంటే అది త్రివిక్రం సినిమాలోనే అనేలా క్రేజ్ తెచ్చుకున్నాడు గురూజీ. సరైన రోల్ లో సరైన కంబ్యాక్ ఇచ్చేలా గురూజీ బలమైన పాత్రలు రాస్తుంటాడు. ఐతే లయ మాత్రం శ్రీరాం వేణుని నమ్మి రీ ఎంట్రీ ఇచ్చింది. దాదాపు ఆమె రెండు దశాబ్దాల తర్వాత మళ్లీ సినిమాలో నటించింది.

లయ టాలెంట్ త్రివిక్రం కి తెలియనిది కాదు. సో కచ్చితంగా ఆయన దృష్టిలో ఆమె పడితే మాత్రం తప్పకుండా ఆమెకు ఒక మంచి రోల్ త్రివిక్రం సినిమాలో ఇస్తే మాత్రం తప్పకుండా లయ అదరగొట్టేస్తుంది. హీరోయిన్ గా చేస్తున్న టైం లో కూడా చాలా సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ వచ్చిన లయ తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంది.

రీ ఎంట్రీ లయ ఆడియన్స్ రెస్పాన్స్..

ఐతే ఆఫ్టర్ లాంగ్ టైం రీ ఎంట్రీ టైం లో ఆమె చేసిన సినిమా హిట్ పడితే బాగుండేది కానీ ఫ్లాప్ అవ్వడం వల్ల నెక్స్ట్ ఛాన్స్ లు కష్టమే అనిపిస్తుంది. అందుకే స్టార్ రీ ఎంట్రీల్లో సిద్ధహస్తుడైన గురూజీ చేతుల్లో పడితే మాత్రం లయ సెకండ్ ఇన్నింగ్స్ కూడా అదరగొట్టే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం త్రివిక్రం వెంకటేష్ తో సినిమాకు రెడీ అవుతున్నారు. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో మైథాలజీ సబ్జెక్ట్ రెడీ అవుతుంది. మరి ఈ సినిమాల్లో లయకు ఛాన్స్ ఉంటుందా అన్నది చూడాలి. రీ ఎంట్రీ తో లయకు రిజల్ట్ ఎలా ఉన్నా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇక మీదట లయ వరుస సినిమాలు చేసే ఛాన్స్ ఉంది.