Begin typing your search above and press return to search.

కష్టాల్లో 'కుబేర'.. వీకెండ్ తరువాత బిగ్ షాక్!

టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటించిన సినిమా 'కుబేర'.

By:  Tupaki Desk   |   24 Jun 2025 11:45 AM IST
కష్టాల్లో కుబేర.. వీకెండ్ తరువాత బిగ్ షాక్!
X

టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటించిన సినిమా 'కుబేర'. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి అంచనాల మధ్య విడుదలైంది. సినిమా మొదటి రోజే మంచి టాక్ సొంతం చేసుకుని, వీకెండ్ వసూళ్లతో నిర్మాతలకు ఉత్సాహం ఇచ్చింది. ఫస్ట్ వీకెండ్‌లోనే రూ.80 కోట్ల వరకూ వసూళ్లు సాధించడం గమనార్హం. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో హౌస్‌ఫుల్ షోలతో దూసుకెళ్లింది.

అయితే తెలుగులో సక్సెస్ ఫుల్ రన్ అందుకున్న ఈ సినిమా, తమిళనాట మాత్రం ఊహించిన స్థాయిలో రాణించలేక పోతోంది. ధనుష్ వంటి స్టార్ హీరో ఉండడంతో తమిళనాట భారీ హైప్ క్రియేట్ అయినా.. ఆడియెన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో స్పందించలేదనే టాక్ వినిపిస్తోంది. విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నప్పటికీ, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో తమిళ వెర్షన్ విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో అక్కడ కలెక్షన్లు మెల్లగా తగ్గిపోయాయి.

ఫస్ట్ వీకెండ్ అనంతరం సోమవారం ఈ సినిమాకు షార్ప్ డిక్లైన్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓవరాల్‌గా మొదటి మూడు రోజుల్లో ఇండియాలో రూ.48.5 కోట్లు, నార్త్ అమెరికాలో దాదాపు రూ.15 కోట్లు కలెక్షన్లు రాగా.. వరల్డ్ వైడ్ మొత్తంగా రూ.80 కోట్ల గ్రాస్ వసూలైంది. కానీ మండే నుంచి కలెక్షన్లలో తగ్గుదల కనిపించడం ఆందోళన కలిగిస్తోంది. యూత్‌ఫుల్ లవ్ స్టోరీలు చేసే శేఖర్ కమ్ముల రెగ్యులర్ ఫార్మాట్ కు భిన్నంగా, డార్క్ డ్రామాగా రూపొందిన చిత్రం కావడంతో వీక్ డేస్‌లో ప్రేక్షకులను నిలబెట్టుకోవడం కష్టమైందని భావిస్తున్నారు.

ఇటీవలే వీకెండ్ కలెక్షన్లు చూసి చిత్ర బృందం సెలబ్రేషన్స్ జరిపిన విషయం తెలిసిందే. కానీ అక్కడి నుంచి వీకెండ్ తరువాత రోజుల్లోకి అడుగుపెట్టినప్పుడు పరిస్థితి భిన్నంగా మారింది. ముఖ్యంగా ధనుష్‌కు కోర్ ఫ్యాన్ బేస్ ఉన్న తమిళనాట నుండి ఆశించిన రెస్పాన్స్ రాకపోవడం, ఫస్ట్ వీక్ ప్రదర్శనపై ప్రభావం చూపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో బలమైన స్పందన వస్తున్నా, తమిళ వెర్షన్ వసూళ్లు వెనుకబడుతున్నాయి.

ఈ నేపథ్యంలో, రెండో వీకెండ్‌కి ముందుగా ప్రమోషన్లు మళ్లీ పుంజుకోవాల్సిన అవసరం ఉందని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. సినిమాకు ఉన్న పాజిటివ్ మౌత్ టాక్‌ను ఉపయోగించుకుని మళ్లీ హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు టార్గెట్ తమిళ ప్రేక్షకులే. అక్కడే రీచ్ పెరిగితే మొత్తం కలెక్షన్లను నిలబెట్టడం సాధ్యమవుతుంది. మరి శేఖర్ కమ్ముల టీమ్ తదుపరి స్ట్రాటజీ ఎలా ఉంటుందో చూడాలి.