కుబేర బాక్సాఫీస్.. హిట్టవ్వాలంటే ఎంత రావాలి?
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘కుబేర’ సినిమా ఎట్టకేలకు థియేటర్లలోకి రాబోతోంది.
By: Tupaki Desk | 19 Jun 2025 6:06 PM ISTశేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘కుబేర’ సినిమా ఎట్టకేలకు థియేటర్లలోకి రాబోతోంది. ఎప్పుడో 2021లో శేఖర్ కమ్ములతో సినిమా చేయనున్నట్లు ధనుష్ ఎనౌన్స్ చేయగా సినిమా రావడానికి ఇంత సమయం పట్టింది. ఇక తనదైన సెన్సిబుల్ కథలతో అందరినీ మెప్పించిన కమ్ముల.. ఈసారి పెద్ద విజన్‌తో, కమర్షియల్ మేకింగ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
తమిళ స్టార్ ధనుష్ హీరోగా నటించగా, అక్కినేని నాగార్జున ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. రష్మిక కథానాయికగా, మొదటిసారి కమ్ముల సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత అందించడం మరొక విశేషం. అయితే ఇప్పటివరకు ఎప్పుడూ తన సినిమాలను చిన్న రేంజ్‌లో ప్లాన్ చేసిన శేఖర్ కమ్ముల ఈసారి మాత్రం భారీ బడ్జెట్‌తో సినిమాను రూపొందించాడు.
అసలైతే మొదట ఈ సినిమాను 100 కోట్ల కంటే తక్కువ బడ్జెట్ తోనే ఫినిష్ చేయాలని అనుకున్నారు. కానీ కాస్టింగ్, సెట్ వర్క్, సాంకేతిక విలువలు పెరగడంతో మొత్తంగా బడ్జెట్ రూ.150 కోట్లకు చేరుకుంది. నిర్మాత సునీల్ నారంగ్ స్వయంగా వెల్లడించిన సమాచారం ప్రకారం, ఈ సినిమాకు డిజిటల్ రైట్స్ మాత్రమే రూ.47 కోట్లను సాధించాయి. ఇప్పుడు థియేట్రికల్ బిజినెస్ విషయానికి వస్తే.. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఓవర్సీస్ తదితర ప్రాంతాల్లో బిజినెస్ టోటల్‌గానే రూ.65 కోట్ల వరకు జరిగినట్లు సమాచారం.
అంటే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే లొకల్ షేర్ అనేది ఈ స్థాయికి రావాలి. దానికి కావలసిన గ్రాస్ మాత్రం కనీసం రూ.120 కోట్లు. అంటే సినిమా చాలా పెద్ద స్థాయిలో వర్క్ అవ్వాలి. ప్రస్తుతం తమిళనాడులో ధనుష్‌కు ఫాలోయింగ్ ఉన్నా కూడా ఈ సినిమా అంచనాలు చాలా భారీగా లేకపోవడం బిజినెస్ మీద ప్రభావం చూపించింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మిక్స్‌డ్‌గా కనిపిస్తున్నాయి. అయితే తెలుగులో మాత్రం ఫెయిర్ బజ్ ఉంది. నాగార్జున ప్రెజెన్స్, రష్మిక క్రేజ్, శేఖర్ మార్క్ కలిసి సినిమా మొదటి రోజు ఓపెనింగ్స్ సాధించడానికి ఉపయోగపడే అవకాశముంది. ఇక సినిమాకు టాక్ పాజిటివ్‌గా వస్తే.. లాంగ్ రన్ ఉంటుందని టీం ధీమాగా ఉంది.
ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్
తెలుగు రాష్ట్రాలు: రూ.33 కోట్లు
తమిళనాడు: రూ.20 కోట్లు
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ.6 కోట్లు
ఓవర్సీస్: రూ.8.5 కోట్లు
మొత్తం థియేట్రికల్ బిజినెస్: రూ.65 కోట్లు
అయితే తెలుగు, తమిళ రెండు మార్కెట్లలోనూ కలిసే మంచి టాక్ వస్తే ఈ లక్ష్యం చేరుకోవడం పెద్ద కష్టమేమీ. అందులోనూ కమ్ముల సినిమాలు క్లిక్కయితే ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్లకు క్యూ కట్టే అవకాశం ఉంది. మరి ఈసారి ఆయన మ్యాజిక్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.