కుబేర.. బాక్సాఫీస్ పరిస్థితి ఎలా ఉందంటే?
ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఇప్పటికే 900K డాలర్ల గ్రాస్ సాధించి దూసుకెళ్తోంది కుబేరా. కమ్ముల క్రేజ్ వలన ఓవర్సీస్ లో కూడా సినిమా బలంగా పర్ఫామ్ చేస్తోంది.
By: Tupaki Desk | 21 Jun 2025 10:44 AM ISTధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ డ్రామా కుబేరా శుక్రవారం థియేటర్లలో గ్రాండ్ గా విడుదలైన విషయం తెలిసిందే. విడుదలకు ముందు సినిమా మీద పెద్దగా హైప్ లేకపోయినా.. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్లు రాబడుతూ, అందరినీ ఆశ్చర్యపరిచింది.
ధనుష్ కెరీర్‌లోనే రెండో అతిపెద్ద ఓపెనింగ్ అవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సినిమా విడుదలైన వెంటనే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా ధనుష్ నటన, కథలోని డార్క్ థీమ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. రివ్యూలు సానుకూలంగా ఉండటమే కాక, వర్డ్ మౌత్ కూడా బాగా పనిచేస్తోంది.
ఈ కారణంగా శనివారం నాటికే ప్రేక్షకుల రద్దీ పెరిగింది. తెలుగులో ఉదయం 39% ఆక్యుపెన్సీతో స్టార్ట్ అయిన సినిమా, మద్యాహ్నానికి 55%, సాయంత్రానికి 57% వరకు పెరిగింది. రాత్రి షోలు అయితే హౌస్‌ఫుల్ స్థాయికి చేరుతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు సినిమాకు పాజిటివ్ వైబ్ ఏ రేంజ్ లో పెరుగుతుందో.
ఓవర్సీస్ లో కూడా సినిమాకు మంచి కలెక్షన్స్ అందుతున్నాయి. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఇప్పటికే 900K డాలర్ల గ్రాస్ సాధించి దూసుకెళ్తోంది కుబేరా. కమ్ముల క్రేజ్ వలన ఓవర్సీస్ లో కూడా సినిమా బలంగా పర్ఫామ్ చేస్తోంది. అమెరికాలో ప్రీమియర్ షోల్లోనే మంచి గ్రాస్ రాబట్టిన కుబేరా.. ఇప్పుడు భారీ కలెక్షన్లు సాధించే దిశగా సాగుతోంది.
అయితే తమిళనాడు మార్కెట్‌లో మొదటి షోలకు మాత్రం ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది. ఉదయం 27%, మద్యాహ్నానికి 29%, సాయంత్రానికి 31% ఆక్యుపెన్సీ మాత్రమే కనిపించింది. కానీ రాత్రికి వీటికి మించి ఆడియన్స్ వస్తున్నారు. ధనుష్‌కు తమిళనాట ఫిక్స్‌డ్ ఫ్యాన్‌బేస్ ఉండటంతో వీకెండ్‌లో మాత్రం వసూళ్లు మెరుగవుతాయన్న నమ్మకం ట్రేడ్ వర్గాల్లో ఉంది.
ఫస్ట్ డే ఇండియన్ నెట్ వసూళ్లు 14 కోట్ల రేంజ్ లో ఉండొచ్చని అంచనా. ఇది ధనుష్ కెరీర్‌లో రెండో బెస్ట్ ఓపెనింగ్ కావడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల్లోనూ నాగార్జున ప్రభావంతో సినిమా బాగా ఆడుతోంది. స్పెషల్ షోలు, ఫ్యాన్ షోలు అన్నీ హౌస్‌ఫుల్ కావడం విశేషం. సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషించగా, రష్మిక ప్రెజెన్స్ కూడా యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. జిమ్ సర్బ్ విలన్‌గా మెప్పించగా, శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన డిఫరెంట్ నెరేటివ్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది. ఇప్పుడు వీకెండ్ పూర్తి కావడంతో సినిమా రూ.40 కోట్ల గ్రాస్ మార్క్‌ను దాటి వెళ్లే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఫస్ట్ డే రికార్డుతో కుబేరా.. కమర్షియల్‌గా క్లియర్ హిట్ దిశగా దూసుకెళ్తోంది.