ఆ రికార్డు బ్రేక్ చేసిన 'కుబేర'.. మూడు లక్షలకు పైగా!
ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షోలో 3 లక్షల 5 వేల టికెట్స్ బుక్ అవ్వగా.. 3 లక్షల 39 వేలకి పైగా టికెట్స్ కుబేరకు బుక్కయ్యాయి.
By: Tupaki Desk | 22 Jun 2025 11:33 PM ISTటాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో నటించిన కుబేర మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆ సినిమాను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు, శేఖర్ కమ్ముల సంయుక్తంగా భారీ బడ్జెట్ తో రూపొందించారు.
రిలీజ్ కు ముందే ఆడియన్స్ లో భారీ అంచనాలు క్రియేట్ చేసిన కుబేర మూవీ.. విడుదలయ్యాక అదే రీతిలో ఇప్పుడు దూసుకుపోతోంది. సినీ ప్రియులను మెప్పిస్తూ అదరగొడుతోంది. మార్నింగ్ షోతోనే పాజిటివ్ టాక్ రాగా.. ఆ తర్వాత షోల నుంచి హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. మొత్తానికి కుబేర అంచనాలకు అందుకుని సత్తా చాటింది.
ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు రూ.30 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు అంచనా వేస్తున్నామని మేకర్స్ ఇటీవల ప్రకటించారు. ఓవర్సీస్ లో కూడా మంచి రెస్పాన్స్ వస్తోందని, నార్త్ అమెరికాలో 1.3 మిలియన్ డాలర్ల గ్రాస్ రాబట్టినట్లు వెల్లడించారు. ఇప్పుడు రెండో రోజు కూడా వరల్డ్ వైడ్ గా కుబేరకు భారీ వసూళ్లు వచ్చినట్లు తెలుస్తోంది.
తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన ధనుష్.. తెలుగులో మరో సూపర్ హిట్ ను సాధించారని చెప్పాలి. అదే సమయంలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఈ ఏడాదిలో వరుస సినిమాలతో సందడి చేసిన విషయం తెలిసిందే. గుడ్ బ్యాడ్ అగ్లీ, విడామయూర్చి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆయన కెరీర్ లో గుడ్ బ్యాడ్ అగ్లీ బిగ్గెస్ట్ హిట్ అయ్యింది.
ఆ సినిమా తెలుగులోనూ రిలీజ్ అయినా.. తమిళనాడులో భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు కుబేర.. తమిళం కన్నా తెలుగులో అదరగొడుతోంది. ఇప్పుడు రెండో రోజు సాలిడ్ బుకింగ్స్ కౌంట్ ను అందుకుంది. గుడ్ బ్యాడ్ అగ్లీ రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ఫిగర్ ను క్రాస్ చేసింది. అలా గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీని కుబేర డామినేట్ చేసింది.
ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్ బుక్ మై షోలో 3 లక్షల 5 వేల టికెట్స్ బుక్ అవ్వగా.. 3 లక్షల 39 వేలకి పైగా టికెట్స్ కుబేరకు బుక్కయ్యాయి. కంటెంట్ బాగుంటే సినిమా భారీ విజయం సాధిస్తుందని కుబేర మరోసారి చాటి చెప్పింది. శేఖర్ కమ్ముల దర్శకత్వం, కథతోపాటు క్యాస్టింగ్ యాక్టింగ్ సినిమాకు ప్లస్ పాయింట్ గా మారింది. మరి ఓవరాల్ గా సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.