Begin typing your search above and press return to search.

‘హీరో’ వివాదం.. తెరదించేసిన నాగ్

బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తున్న 'కుబేర' సినిమాలో హీరో ఎవరనే చర్చ రెండు రోజులుగా సోషల్ మీడియాను ఊపేస్తోంది. రిలీజ్‌కు ముందేమో ఇందులో తాను, ధనుష్ హీరోలం కాదని.. దర్శకుడు శేఖర్ కమ్ములనే హీరో అని వ్యాఖ్యానించారు నాగార్జున.

By:  Tupaki Desk   |   23 Jun 2025 12:57 PM IST
‘హీరో’ వివాదం.. తెరదించేసిన నాగ్
X

బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తున్న 'కుబేర' సినిమాలో హీరో ఎవరనే చర్చ రెండు రోజులుగా సోషల్ మీడియాను ఊపేస్తోంది. రిలీజ్‌కు ముందేమో ఇందులో తాను, ధనుష్ హీరోలం కాదని.. దర్శకుడు శేఖర్ కమ్ములనే హీరో అని వ్యాఖ్యానించారు నాగార్జున. కానీ రిలీజ్ తర్వాత సక్సెస్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ.. శేఖర్ కమ్ముల కథ చెప్పినపుడు తనే హీరోలా ఫీలయ్యానని.. ఈ కథ అంతా తన చుట్టూనే తిరుగుతుందని నాగ్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది.

అదే ప్రెస్ మీట్లో మరోసారి శేఖర్ కమ్ములనే ఈ చిత్రానికి హీరో అంటూ ఆయన చేసిన కామెంట్‌ను పట్టించుకోకుండా.. 'నేను హీరోలా ఫీలయ్యా' అన్న మాటను పట్టుకుని ధనుష్ ఫ్యాన్స్ గొడవ చేశారు. దీని మీద సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో కూడా రచ్చ జరిగింది.

ఐతే ఈ వివాదం మీద 'కుబేర' సక్సెస్ మీట్లో నాగ్ స్పందించాడు. తాను ప్రెస్ మీట్లో అన్న మాటలు వేరని.. కానీ వెబ్ సైట్లలో వచ్చిన వార్తల్లో, మీమ్స్‌లో వేరే రకంగా దాన్ని ప్రొజెక్ట్ చేశారని నాగ్ అన్నారు. ఈ మీమ్స్, వార్తలు తన వరకు వచ్చాయని.. ఈ సినిమాలో తానే హీరో అని చెప్పుకున్నట్లుగా ప్రచారం చేశారని నాగ్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ సినిమాలో దీపక్ హీరో అని, దేవా హీరో అని, సమీర హీరో అని, ఖుష్బూ, ఖేలు కూడా హీరోలే అని నాగ్ వ్యాఖ్యానించారు. అందరికీ మించి సినిమాకు అతి పెద్ద హీరో దర్శకుడు శేఖర్ కమ్ములనే అని ఆయన స్పష్టం చేశారు. ‘కుబేర’కు వస్తున్న స్పందన పట్ల ఆయన అమితానందం వ్యక్తం చేస్తూ.. తన కెరీర్‌ను ఈ సినిమా గొప్ప మలుపు తిప్పుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఇక తన కోసం కొత్త కొత్త పాత్రలు రాస్తారని.. వాటి కోసం తాను ఎంతో ఎగ్జైట్మెంట్‌తో ఎదురు చూస్తున్నానని నాగ్ చెప్పారు. దీని వల్ల ఇంకో 40 ఏళ్లు తన కెరీర్ కొనసాగుతుందని, తాను ఇక్కడే ఉంటానని నాగ్ చమత్కరించారు.