తమిళ హీరోల టాప్ ఓపెనింగ్స్.. ధనుష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బెస్ట్!
తమిళ స్టార్ హీరోలు చేసిన పాన్ ఇండియా ప్రయోగాలు ఇటీవల బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.
By: Tupaki Desk | 22 Jun 2025 1:52 AM ISTతమిళ స్టార్ హీరోలు చేసిన పాన్ ఇండియా ప్రయోగాలు ఇటీవల బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. భారీ బడ్జెట్ సినిమాలతో తమ మార్కెట్‌ను విస్తరించేందుకు ప్రయత్నిస్తూ, తమిళ నటులు ఒక్కొక్కరుగా వరల్డ్‌వైడ్ ఓపెనింగ్ రేంజ్‌ను పెంచుకుంటున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు కుబేరా సినిమా కొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది.
ప్రముఖ తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన కుబేరా సినిమా ఈ శుక్రవారం గ్రాండ్‌గా రిలీజ్ అయింది. ధనుష్, నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో సాగిన ఈ సినిమా మొదటి రోజే హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.
లేటెస్ట్ సమాచారం ప్రకారం, “కుబేరా” సినిమా వరల్డ్ వైడ్ ఓపెనింగ్ డే కలెక్షన్లు రూ. 28.40 కోట్లకు చేరుకున్నాయి. ఇది ధనుష్ కెరీర్‌లోనే సొలోగా వచ్చిన బెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. శేఖర్ కమ్ముల మార్క్ డైరెక్షన్, స్టోరి కంటెంట్, ధనుష్ నటన అన్నీ కలిసి ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద నిలబెట్టాయి. ఈ విజయం తెలుగులోనూ తమిళంలోనూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
ఇక విశేషం ఏమిటంటే.. ఇంతకు ముందు టాప్ ఓపెనింగ్స్ అందుకున్న వారిలో అందరూ స్టార్ మాస్ హీరోలే ఉన్నారు. కానీ ధనుష్ వంటి నేచురల్ నటుడికి కూడా భారీ ఓపెనింగ్ రావడం సినిమాకి ఉన్న క్రేజ్‌కు నిదర్శనం. పైగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో రావడం, నాగార్జున ఉన్నటంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ భారీ ఆసక్తి నెలకొంది.
ఇక తమిళ హీరోల కెరీర్ బెస్ట్ సొలో ఓపెనింగ్ కలెక్షన్ల జాబితా ఇలా ఉంది:
విజయ్ – లియో: 148.60 కోట్లు
రజనీకాంత్ – 2.0: 94.20 కోట్లు
కమల్ హాసన్ – విక్రమ్: 60.50 కోట్లు
అజిత్ – గుడ్ బ్యాడ్ అగ్లీ: 52.00 కోట్లు
సూర్య – కంగువా: 40.00 కోట్లు
శివ కార్తికేయన్ – అమరన్: 35.00 కోట్లు
ధనుష్ – కుబేరా: 28.40 కోట్లు
విక్రమ్ – కోబ్రా: 24.20 కోట్లు
రాఘవ లారెన్స్ – కాంచన 3: 21.05 కోట్లు
ఈ లిస్టులో ధనుష్ “కుబేరా”తో 7వ స్థానంలోకి వెళ్లడం విశేషం. తక్కువ ప్రమోషన్, కంటెంట్ ఆధారంగా వచ్చిన సినిమాకు ఈ స్థాయిలో ఓపెన్ అవడం అరుదైన విషయం. దీనితో తమిళ హీరోల్లో నేచురల్ స్క్రిప్ట్ సెలక్షన్‌తోనే భారీ ఓపెనింగ్స్ సాధించవచ్చని క్లారిటీ వచ్చేసింది.