కుబేర బాక్సాఫీస్ లెక్కలు ఇలా.. త్వరలోనే అలా..
అయితే ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన వ్యక్తికి,వీధుల్లో జీవించే ఓ అతి పేదవాడికి మధ్య జరిగే సంఘర్షణనే కుబేర మూవీ అని చెప్పాలి.
By: Tupaki Desk | 23 Jun 2025 5:25 PM ISTకోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న లీడ్ రోల్స్ లో నటించిన మూవీ కుబేర. టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఆ సినిమాను సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించగా.. శేఖర్ కమ్ముల నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.
అయితే ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన వ్యక్తికి,వీధుల్లో జీవించే ఓ అతి పేదవాడికి మధ్య జరిగే సంఘర్షణనే కుబేర మూవీ అని చెప్పాలి. జూన్ 20వ తేదీన పాన్ ఇండియా రేంజ్ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన సినిమా.. ఇప్పుడు ఓ రేంజ్ లో మెప్పిస్తోంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. సక్సెస్ ఫుల్ గా వీకెండ్ ను కంప్లీట్ చేసుకుంది.
రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో అదరొగడుతోంది. అయితే ఇప్పుడు మూవీకి వస్తున్న రెస్పాన్స్ తో అనేక చోట్ల ఎక్స్ ట్రా షోస్ వేస్తున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా.. ఇప్పుడు మరిన్ని థియేటర్స్ లో సినిమాను వేస్తున్నారు. దీంతో కుబేర మూవీ.. తన పెట్టుబడిని త్వరలోనే తిరిగి పొందే అవకాశం ఉందని క్లియర్ గా తెలుస్తోంది.
ఇప్పుడు మరో మూడు- నాలుగు రోజుల్లో కుబేర మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ ఫీట్ ను సాధించనుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరనుందని సమాచారం. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం, కుబేరా చిత్రం ప్రపంచవ్యాప్తంగా మూడవ రోజు దాదాపు 25 కోట్ల రూపాయలు వసూలు చేసిందని సమాచారం.
ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా రూ.74 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. ఆదివారం (3వ రోజు) ఈ చిత్రం.. ఇప్పటివరకు అత్యధిక సింగిల్ డే వసూళ్లు సాధించినట్లు సమాచారం. సీతారే జమీన్ పర్ తో గట్టి పోటీ ఎదరువుతున్నా.. కుబేర మూవీ దూసుకుపోతోంది. మంచి వసూళ్లను సాధిస్తూ సత్తా చాటుతోంది.
కాగా.. జూన్ 27వ తేదీన కన్నప్ప మూవీ విడుదల కానుంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రానున్న ఆ సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. అయితే కన్నప్పకు పాజిటివ్ టాక్ వస్తే.. కుబేరకు మరో పోటీ ఎదురవ్వనుంది. మరి ఫైనల్ గా కుబేర మూవీ.. ఓవరాల్ గా ఎంత వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.