Begin typing your search above and press return to search.

కుబేర.. బుకింగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయంటే..

ధనుష్ - నాగార్జున ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన కుబేర సినిమా జూన్ 20న విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

By:  Tupaki Desk   |   22 Jun 2025 12:58 PM IST
కుబేర.. బుకింగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయంటే..
X

ధనుష్ - నాగార్జున ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన కుబేర సినిమా జూన్ 20న విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సామాజిక అంశాలతో రూపొందిన ఈ పాన్ ఇండియా డ్రామా తొలి రోజునే ప్రేక్షకులను మెప్పించగలిగింది. ముఖ్యంగా మొదటి రోజు చూసినవారు పాజిటివ్ రివ్యూలు ఇవ్వడంతో సినిమాకు కలెక్షన్స్ పెరుగుతూ వసగున్నాయి. అలాగే ప్రేక్షకులే మౌత్ టాక్ తో మాస్ లెవెల్‌లో ప్రమోట్ చేస్తుండటంతో బుకింగ్స్ రేంజ్‌ పెరిగాయి.

ఫస్ట్ డే బుక్మైషోలో 3.28 లక్షల టికెట్లు అమ్ముడవ్వగా, రెండో రోజున ఈ సంఖ్య 3.39 లక్షలకు చేరుకుంది. వీటితో పాటు థర్డ్ డే అడ్వాన్స్ బుకింగ్స్ భారీగా పెరగడం ద్వారా సినిమాకు వీకెండ్ హవా స్పష్టంగా కనిపిస్తోంది. మల్టీప్లెక్సులతో పాటు బీ, సీ సెంటర్లలో కూడా ‘కుబేర’ మంచి ఆక్యుపెన్సీ సాధిస్తున్నట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ధనుష్ చేసిన బిచ్చగాడి పాత్రలోని లోతైన ఎమోషనల్ టచ్, నాగార్జున స్టైలిష్ నెగటివ్ షేడ్స్ - రెండూ ఆడియెన్స్‌కు కిక్కిచ్చేలా ఉన్నాయి. ముఖ్యంగా నాగ్ పోషించిన CBI అధికారిక పాత్రపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం పడుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం సినిమాకు మిగతా మల్టీస్టారర్ల లా కాకుండా ఓ డిఫరెంట్ టోన్‌ను ఇచ్చింది. సినిమాకు సంగీతంగా దేవిశ్రీప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో హైలైట్ అయ్యింది.

వీటితో పాటు కథలో చూపించిన బ్లాక్ మనీ, సామాజిక విలువలు ఇవన్నీ ప్రేక్షకులను తాకేలా ఉండటంతో అన్ని వర్గాల నుండి ఆదరణ లభిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లోని రివ్యూలు కూడా సినిమాను ఒక మంచి ఎగ్జాంపుల్‌గా ప్రెజెంట్ చేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో దూసుకెళ్తున్న ప్రమోషన్ వలన ఆదివారం రంజాన్ సెలవు దృష్ట్యా కలెక్షన్ల స్పీడ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

ఈ హవా చూస్తుంటే కుబేర సినిమాకు బాక్సాఫీస్‌ వద్ద నెక్స్ట్ వీకెండ్ వరకూ హై ఆక్యుపెన్సీ కొనసాగేలా కనిపిస్తోంది. నాగార్జున, ధనుష్ ఇద్దరికి ఇది కంటెంట్‌తో కలిసి మాస్ మరియు క్లాస్ మార్కెట్‌ను మళ్లీ సాధించిపెట్టే మూవీగా నిలిచే అవకాశం ఉంది. అలాగే దర్శకుడిగా కమ్ముల లెవెల్ ను పెంచింది.